త్రిఫల ఔషధాన్ని రోజూ వాడితే రోగాలు దరిచేరవు!

పూర్వం ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా.. కేవలం ఆయూర్వేదంతోనే నయం చేసుకునేవారు. నామమాత్రపు ఖర్చులతో ఎంత పెద్ద రోగమైన తగ్గించుకునేవారు. నటి కాలంలో గట్టిగ తుమ్మినా.. దగ్గినా నేరుగా ఆస్పత్రికి పరుగులు తీసి వేలకు వేలు చెల్లించుకుంటున్నారు. నేటికాలంలోనూ కొందరు ఆయుర్వేదాలను నమ్ముతూ వాటినే వినియోగిస్తున్నారు. త్రిఫల( మూడు ఫలాలు) అనేది ఆయుర్వేదంలోనే అతి పురాతన మరియు దివ్య ఔషధం. మూడు రకాల ఔషధాలను కలిసి తయారు చేయడంతో దీన్ని త్రిఫల ఔషధంగా పేరు పిలువబడుతోంది.

వీటిలో ఉసిరి, కరక్కాయ, తానికాయ మందులు ఉన్నాయి. ఈ ఔషధం అనేక నయం చేయలేని వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం త్రిఫలలోని ప్రతి పండు శరీరంలోని మూడు దోషాలను సానుకూలంగా ప్రభావితం చేస్తుందని చెబుతారు. వాత, పిత్త కఫా. ఈ దోషాలు శరీరం, మనస్సు, మరియు ఆత్మను వ్యాప్తి చేస్తాయని నమ్ముతారు. త్రిఫల లోని పదార్థాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి వాత, పిత్త, కఫా దోషాలను నయం చేయగలదని సమతుల్యం చేయగలవని నమ్ముతారు.

త్రిఫల తీసుకోవడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉండటంతో పాటు దూరదృష్టి సరిగ్గా ఉంటుంది. ఎలాంటి చర్మ వ్యాధులు దరిచేరవు. అలెర్జీలు, ఇన్ఫెక్షన్లను నివారించడంలో త్రిఫల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శరీంలో ఇన్ఫెక్షన్స్‌ని త్రిఫల వినియోగంతో శరీరాన్ని బలోపేతం చేయడానికి పని చేస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్ణం, పుల్లని త్రేనుపు, అపానవాయువు మొదలైన జీర్ణ సమస్యలను కూడా నివారిస్తుంది. త్రిఫల క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. దీని వినియోగం వల్ల త్వరగా ముడతలు పడవు, మచ్చల సమస్య కూడా దూరం అవుతుంది. త్రిఫల పొడిని ఒక గ్లాసు నీటిలో 10 నిమిషాలు మరిగించి కళ్లను కడిగితే సత్ఫలితాలు ఇస్తాయి.

ఈ చూర్ణాన్ని ఆవు నెయ్యి తేనెతో కలిపి తీసుకుంటే కంటి కణజాలం, నరాలు బలపడతాయి. మీరు చర్మంపై త్రిఫలాన్ని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. మొదటిది కడుపులోకి తీసుకోవటం.. త్రిఫల చూర్ణాన్ని తేనెతో కలిపి ప్రతిరోజూ సేవించాలి. ఇది మీ చర్మం మెరుపును పెంచుతుంది.. వృద్ధాప్యం, మొటిమలు, మచ్చలు మొదలైన సమస్యల నుండి దూరంగా ఉంచుతుంది. చర్మరక్షణలో త్రిఫల రక్తాన్ని శుద్ధిచేస్తుంది. రక్తశుద్ధితో చర్మవ్యాధులు తొలగిపోతాయి.

కొందరి చర్మం సున్నితంగా ఉండి ఎలర్జీలకు గురి అవుతుంది. ఈ లోపాన్ని త్రిఫల సరిచేస్తుంది. సూర్యరశ్మి వలన కలిగే దుష్ప్రభావాలను కూడా త్రిఫల నిరోధిస్తుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు త్రిఫల చూర్ణాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా వారి పొట్టను శుభ్రం చేసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు 5 గ్రాముల త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటితో తీసుకోవాలి. ఒక చెంచా త్రిఫలచూర్ణం రెండు చెంచాల కొబ్బరి నూనెలో మరిగించి వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే శిరోజాలకు మేలు చేస్తాయి. తలస్నానం తర్వాత త్రిఫల చూర్ణం కషాయం తో చివరిగా తలమీద పోసుకుంటే శిరోజాలు నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts