Credit Cards: క్రెడిట్‌ కార్డులతో లాభాలు.. కానీ.. జాగ్రత్తలు అవసరమే!

Credit Cards: ప్రస్తుతం లావాదేవీలన్ని కార్డులతోనే కొనసాగుతున్నాయి. ఈ కాలంలో క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు లేని వారు అస్సలు ఉండారు. ఒక్కొక్కరి వద్ద రెండుకు మించి క్రెడిట్‌ కార్డులను వాడుతున్నారు. అయితే వాటిని తీసుకున్నప్పుడు సరైన రీతిలో వాడక కొందరు అప్పులకు గురవుతున్నారు. క్రెడిట్‌ కార్డు అవసరానికి డబ్బులు, వస్తువులు కొనుగొలు చేసేందుకు చాలా ఉపయోగకరంగా ఉన్నా.. దాన్ని ముందు ఎలా వాడాలో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. వాడే విధానం తెలియకపోతే ఇక అప్పుల ఊబిలో కూరుకుపోవాల్సిందే. డబ్బు లేనప్పుడు ఎక్కువగా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తారు. చాలా బ్యాంకులు నిర్దిష్ట కొనుగోలు తర్వాత వార్షిక రుసుంలు మాఫీ చేస్తాయి. ప్రతి కొనుగోలుతో వినియోగదారుడు రివార్డ్ పాయింట్‌లను పొందుతాడు. ఇంకో విషయం ఏంటంటే బిల్లును సకాలంలో చెల్లిస్తే వడ్డీ వసూలు ఉండదు. అప్పుడు క్రెడిట్ స్కోర్ కూడా మెరుగు పడుతుంది. ఎంత వాడినా కూడా బిల్లులు మాత్రం సమయానికి చెల్లించాలి. చివరి తేదీలోపు చెల్లించకపోతే ఎక్కువ వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.

అనువైన క్రెడిట్ కార్డ్‌ను తీసుకోవాలి..

మార్కెట్‌లో అందుబాటులో ఉన్న అన్ని క్రెడిట్ కార్డ్‌లను గమనిస్తే భిన్న విభిన్న ఫీచర్ల కార్డులను ఎంచుకోవాలి. ఈ-కామర్స్ కంపెనీలు, చమురు మార్కెటింగ్ కంపెనీలు లేదా బ్రాండ్‌ల సమూహంతో బ్యాంకుల నిర్దిష్ట ఒప్పందాల ఆధారంగా క్రెడిట్ కార్డ్‌లు ఉంటాయి. షాపింగ్‌లో ఎక్కువ భాగం కవర్ చేసే కార్డ్‌నే ఎంచుకోవాలి. నిర్దిష్ట కంపెనీ పెట్రోల్ బంక్‌లో ఎక్కువ ఇంధనాన్ని కొనుగోలు చేస్తే లేదా ఈ-కామర్స్ కంపెనీ ద్వారా ఎక్కువ షాపింగ్ చేస్తే, దానితో అనుబంధించబడిన క్రెడిట్ కార్డ్‌ను తీసుకునేందుకు ట్రై చేయాలి.దీంతో ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. బీమా కవర్, రివార్డ్ పాయింట్లు, క్యాష్ బ్యాక్ వంటి అన్ని ఆఫర్ల గురించి తెలుసుకుని సరైన క్రెడిట్ కార్డ్‌ను తీసుకోవాలి .

ఈఎమ్‌ఐలు ఇలా..

క్రెడిట్ కార్డ్‌ల అతి పెద్ద లక్షణం కొనుగోళ్లను ఈఎమ్‌ఐలుగా మార్చుకునే సదుపాయం ఉంటుంది. దీనితో చిన్న మొత్తాలతో పెద్ద కొనుగోళ్లు చేయవచ్చు. అయితే.. ఈఎమ్‌ఐలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది చాలా తక్కువ వ్యవధి, అనగా 3 – 9 నెలల వరకు ఉండే నో-కాస్ట్ ఈఎమ్‌ఐ. ఏడాది కంటే ఎక్కువ వడ్డీతో కూడిన రెండవ ఈఎమ్‌ఐ. తక్కువ వడ్డీకి నో-కాస్ట్ ఈఎమ్‌ఐ లేదా ఆఫర్‌ను పొందడంలో క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీ బడ్జెట్ కన్నా 20-30 శాతం ఎక్కువ షాపింగ్ చేయాలనుకుంటే, నో కాస్ట్ ఈఎమ్‌ఐ ప్రయోజనాన్ని పొందితే వడ్డీ కూడా ఆదా అవుతుంది. ఒకవేళ మీకు డబ్బుల సమస్య ఉంటూ 18-24 నెలల చిన్న ఈఎమ్‌ఐతో కొనుగోలు చేసుకోవచ్చు.

పాటించాల్సిన జాగ్రత్తలు..

క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా ఉపయోగించాలి. నిజానికి నిర్ణీత సమయంలో చెల్లించాల్సిన రుణం. దీనిలో చెల్లించాల్సిన తేదీ, కనీస చెల్లింపు, ఈఎంఐ మార్పులోపు పూర్తి చెల్లింపు చేయడానికి సూచనలు అవసరం. లేదంటే బ్యాంకు అధిక వడ్డీని వసూలు చేసే అవకాశం ఉంటుంది. అంతేకాక క్రెడిట్ కార్డు నుంచి నగదు ఉపసంహరణ సౌకర్యం సైతం ఉంటుంది కానీ.. ఎక్కువ వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయమేమిటంటే ఎట్టి పరిస్థితుల్లో క్రెడిట్‌ కార్డులను ఏటీఎంలో పెట్టి డబ్బులను తీసుకోరాదు. అలా చేస్తే మీకు భారీగా వడ్డీ పడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -