Bhaghpat: కుర్రాడితో ముచ్చటగా 3 రాత్రుళ్ళు గడిపిన మహిళ.. కానీ?

Bhaghpat: రోజురోజుకీ దేశవ్యాప్తంగా వివాహేతర సంబంధాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ వివాహేతర సంబంధాల మోజులో పడి భార్య భర్తలు వారి జీవితంలో నాశనం చేసుకోవడంతో పాటు ఒకరినొకరు చంపుకోవడం వరకు వెళుతున్నారు. తాజాగా కూడా ఒక మహిళా తన భర్తని మోసం చేసి పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని ఒక హోటల్లో మూడు రోజులపాటు గడపాలని అనుకుంది. అనుకున్న విధంగా ప్లాన్ కూడా వేసుకున్నారు. కానీ హోటల్ కి వెళ్లి చూడగా ఆ మహిళ విగతజీవిగా కనిపించింది. అసలేం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్ లోని బాగ్ పట్ ప్రాంతానికి చెందిన రచన రాజ్ కుమార్ లు భార్యభర్తలు.

 

 

రచన ఓ ప్రవేట్ కంపెనీలో క్లర్క్ గా పనిచేస్తుండగా ఆమె భర్త రాజ్ కూలీ పనులకు వెళ్ళేవాడు. అయితే ఈ క్రమంలోనే రచనకు కొన్ని నెలల క్రితం బిహార్ స్టేట్ భోజ్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గౌతమ్ తో పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త విహహేతర సంబంధం వరకు దారితీసింది. దాంతో ఏకాంతంగా ఎక్కడికైనా వెళ్లి కలుసుకోవాలని ఇద్దరు నిర్ణయించు డిసెంబర్ 23న వీరిద్దరు మీరట్ లో కలుసుకోవాలి అనుకున్నారు. అక్కడే హోటల్ లో రెండు రాత్రులు గడిపి అనంతరం ఆదివారం సాయంత్రం ఘాజియాబాద్ చేరుకున్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఇద్దరు హోటల్ లోకి వచ్చారు.

 

ఇక సోమవారం ఉదయం 10.30 నిమిషాలకు గౌతమ్ హోటల్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అయితే అతను ఎంతకీ తిరిగిరాకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం వచ్చి మధ్యాహ్నం గదిలోకి వెళ్లి చూడగా రచన విగతజీవిగా పడిఉంది. దాంతో వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడిని సిసి ఫుటేజ్ ద్వారా అదుపులోకి తీసుకొని విచారించగా రచనతో నాలుగు నెలలుగా సంబంధం ఉందని, హోటల్ లో తనతో కలిసి రాత్రి ఉండేందుకు ఒప్పుకోలేదని, ఇంటికి వెళ్తానని గొడవ పెట్టుకోవడంతోనే తానే గొంతు నులిమి చంపినట్లు అతడు అంగీకరించడంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Related Articles

ట్రేండింగ్

AP Liquor: పేద కుటుంబాలతో జగన్ చెలగాటం.. సర్కారు మద్యం తాగితే ప్రాణాలకే ప్రమాదమా?

AP Liquor: గత ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే మధ్యపానాన్ని విడతలవారీగా పూర్తిగా నిషేధిస్తాను అంటూ తన నవరత్నాలలో ఒక రత్నంగా మద్యపాన నిషేధాన్ని చేర్చారు....
- Advertisement -
- Advertisement -