Bhagawant Kesari: భగవంత్ కేసరి టీజర్ రివ్యూ.. బాలయ్య రూటు మార్చేశాడా?

Bhagawant Kesari: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇన్ని రోజులు ఈ సినిమా NBK 108సినిమా షూటింగ్ పనులను జరుపుకుంది. ఇక నేడు బాలకృష్ణ పుట్టిన రోజు కావడంతో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ అభిమానులను సంతోషానికి గురి చేశారు. ఈ సినిమా టైటిల్ భగవంత్ కేసరి అని విడుదల చేయడమే కాకుండా ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం భగవంత్ కేసరి టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ టీజర్ చూస్తే సినిమా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ప్రతిసారి పొలిటికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. అయితే ఈసారి మాత్రం తన రూటు మార్చారని ఈ టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య కూడా విభిన్నమైన లుక్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పాలి.

 

అత్యంత భారీ యాక్షన్ సన్ని వేషాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇక చివరిలో బాలయ్య చెప్పే డైలాగ్స్ భగవంత్ కేసరి ఈ పేరు సానా ఏళ్లు యాదుంటది అనే డైలాగ్ హైలైట్ అయిందని చెప్పాలి. మొత్తానికి బాలయ్య మరోసారి ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారని చెప్పాలి.ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన స్టార్, సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. అదేవిధంగా యంగ్ బ్యూటీ శ్రీ లీల కూడా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -