Bhuma Mounika-Manchu Manoj: ఆ పార్టీలోకి భూమా మౌనిక.. మనోజ్ ప్లాన్ ఇదేనా?

Bhuma Mounika-Manchu Manoj: రాజకీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేరు. రాజకీయం అంటే అదే మరీ అంటున్నారు విశ్లేషకులు. కర్నూలు జిల్లా రాజకీయంలో భూమా ఫ్యామిలీకి మంచి పేరుంది. ప్రస్తుతం భూమా వారసులు పొలిటికల్ గా రాణిస్తున్నారు. తాజాగా భూమా అమ్మాయిని మంచు మనోజ్ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం భూమా మౌనిక రెడ్డి భవిష్యత్తుపై మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

ఇంకా మంచు మనోజ్ మాట్లాడుతూ.. తాను ప్రస్తుతం సినిమాలో బిజీగా ఉన్నానని, మౌనికకు రాజకీయాలపై ఆసక్తి ఉందంటే అందుకు తాను సహకరిస్తానని మనోజ్ స్పష్టం చేశారు. ఇప్పటికే భూమా మౌనిక సోదరి భూమా అఖిలప్రియ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆమె గతంలో మంత్రిగా కూడా పని చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగళ్లడ్డ నుంచి ఆమె పోటీ చేయనున్నారు. ఈ క్రమంలోనే భూమా మౌనిక కూడా రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారని, అందుకే మౌనికకు రాజకీయాలపై ఆసక్తి ఉందంటే తాను సహకరిస్తానని మనోజ్ చెప్పి ఉంటారని అంటున్నారు.

టీడీపీ నుంచి అక్కా, చెల్లెళ్ళల్లెళ్ళకు ఇద్దరిద్దకీ టికెట్లు ఇచ్చే అవకాశం లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం ఇస్తారు. దాంతో మౌనిక వైసీపీ నుంచి టికెట్ ఇస్తామని హామీ ఇస్తే ఫ్యాన్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఆమె మేనమామ ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీలోనే ఉన్నారు. అలాగే మనోజ్  తండ్రి, మౌనిక మామ మోహన్ బాబు కూడా వైసీపీలో కొనసాగుతున్నారు. దీంతో ఆమె కూడా వైసీపీ నుంచి ఆఫర్ వస్తే వైసీపీలో చేరవచ్చునని చెబుతున్నారు. ఇక మౌనికారెడ్డి రాజకీయంగా ఉత్సాహం చూపిస్తే కనుక చిత్తూరు జిల్లా చంద్రగిరి టికెట్ ఇవ్వడానికి వైసీపీ హై కమాండ్ రెడీగా ఉందని ప్రచారం జరుగుతోంది.

 

ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు. ఆయన రెండు సార్లు గెలిచి ఉన్నారు. మౌనికారెడ్డి కనుక ఓకే అంటే కనుక ఈ టికెట్ ఆమెకు ఇచ్చి చెవిరెడ్డికిడ్డి తిరుపతికి పంపిస్తారు అని అంటున్నారు. ఇక తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డినిడ్డి టీటీడీ చైర్మన్ గా చేస్తారు అని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పార్టీ నిర్వహణ అవసరాల కోసం 10 కోట్ల రూపాయలు ప్రకటించిన పవన్.. గ్రేట్ కదా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ అవసరాల కోసం పెద్ద ఎత్తున తన సొంత డబ్బును ఖర్చు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా ఎవరైనా...
- Advertisement -
- Advertisement -