Rishabh Pant: పంత్ ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్.. మరో 9 నెలల పాటు ఆటకు దూరం

Rishabh Pant: రోడ్డుప్రమాదంలో గాయపడ్డ టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. అయితే అతడి ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్‌ను వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. పంత్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ తెలిపారు.

 

అయితే డాక్టర్లు మాత్రం పంత్ పూర్తిగా కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని వెల్లడించారు. కనీసం 8 నుంచి 9 నెలల సమయం పడుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. దీంతో పంత్ ఐపీఎల్‌తో పాటు ఈ ఏడాది జరగనున్న ఆసియాకప్, వన్డే ప్రపంచకప్‌కు సైతం దూరం అవుతాడనే వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పష్టత లేకపోయినా పంత్ కోలుకోవడమే తమకు ముఖ్యమని బీసీసీఐ, అభిమానులు స్పష్టం చేస్తున్నారు.

 

అటు పంత్ తాజా ఆరోగ్యంపై బీసీసీఐకి వైద్యులు సమాచారం అందజేసినట్లు తెలుస్తోంది. స్కాన్ రిపోర్టులు వచ్చిన తర్వాత పంత్ మోకాలి గాయం తీవ్రతపై 4 రోజుల్లో స్పష్టత వస్తుంది. ఆ తర్వాత మోకాలికి సర్జరీ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ వైద్యుల అంచనా నిజమైతే టీమిండియాకు నిజంగానే బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. పంత్ 8 నెలల తర్వాత కోలుకున్నా.. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయడానికి అతడికి మరింత టైం పట్టే అవకాశం ఉంది.

 

పంత్ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?
ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే ఈ ఏడాదంతా పంత్ క్రికెట్ ఆడే పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో టీమిండియాకు వికెట్ కీపర్‌గా పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ లేదా సంజు శాంసన్ ప్రత్యామ్నాయాలుగా కనిపిస్తున్నారు. అయితే వీళ్లిద్దరిలోనూ నిలకడ లేకపోవడం మైనస్‌గా మారింది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌లో యువ వికెట్ కీపర్ కేఎస్ భరత్ ప్రదర్శన చూసిన తర్వాతే ఈ ఏడాది టీమిండియా వికెట్ కీపర్ ఎవరో తేలనుంది. పరిమిత ఓవర్ల క్రికెట్ వరకు ఇషాన్ కిషన్‌కు అవకాశాలు లభించవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -