Bigg Boss: శ్రీసత్య కోసం ఆదిరెడ్డి బలి.. బిగ్‌బాస్‌పై ప్రేక్షకులు ఫైర్!!

Bigg Boss: తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్రజాధారణ పొందుతున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’. ఇప్పటికే 5 సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం సీజన్-6 కొనసాగుతోంది. అయితే ఈ షో చివరి దశకు చేరుకుంది. త్వరలో సీజన్-6 ముగియనుంది. షోకి ఎండ్ కార్డు పడటానికి తక్కువ రోజులు ఉండటంతో.. కంటెస్టెంట్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. అయితే రేవంత్ తన తొందరపాటు వల్ల ‘టికెట్ టు ఫినాలే’లో గెలిచే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. దాంతో ఆ ఛాన్స్ శ్రీహాన్‌కు వెళ్లింది. ఎలాంటి పోటీ లేకుండా శ్రీహాన్ ఫైనల్స్ కు చేరడంపై అందరూ షాక్‌కు గురవుతున్నారు. రోహిత్, కీర్తి, ఇనయా ఎలిమినేట్ రౌండ్ నుంచి తప్పుకున్నారు. కానీ ఊహించని విధంగా ఫైమా ఎలిమినేట్ అయింది.

 

ఈ వారం ప్రేక్షకుల ఓటింగ్స్ లో ఎప్పటిలాగే రేవంత్ తొలి స్థానంలో నిలిచాడు. అయితే రెండో స్థానంలో రోహిత్, మూడో స్థానంలో ఆదిరెడ్డి, నాలుగో స్థానంలో కీర్తి, ఐదో స్థానంలో శ్రీసత్య నిలిచింది. ఓటింగ్స్ చివరి స్థానంలో నిలిచిన ఫైమా మాత్రం ఎలిమినేట్ అయింది. అయితే ఎలిమినేషన్ రౌండ్‌లలో అవకతవకలు జరుగుతున్నాయని మొదటి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ తన టీఆర్‌పీని పెంచుకోవడానికి కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేస్తున్నట్లు సమాచారం. షోలో కొందరు కంటెస్టెంట్లను సేవ్ చేయడానికి మరొకరిని ఎలిమినేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా అలాంటి మరో పుకారు బయటకొచ్చింది.

 

తాజాగా బిగ్‌బాస్ టాప్-5 కంటెస్టెంట్ల జాబితాను సిద్ధం చేసిందట. అయితే ఐదో స్థానంలో ఉన్న శ్రీసత్యను టాప్-5లో ఉంచి.. ఆదిరెడ్డిని ఎలిమినేట్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఓటింగ్స్ లో శ్రీసత్య కంటే ఆదిరెడ్డి ముందంజలో ఉన్నాడు. కానీ శ్రీసత్యను సేవ్ చేసి ఆదిరెడ్డిని ఎలిమినేట్ చేయాలని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. ఒకవేళ అదే జరిగితే ఆదిరెడ్డికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ విషయంపై తెలుగు ప్రేక్షకులు కూడా ఫైర్ అవుతున్నారు. ఓటింగ్‌ను పరిగణలోకి తీసుకోకుండా.. ఇష్టం వచ్చినట్లు షో నిర్వహిస్తున్నారని మండిపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

News Arena India: మళ్లీ జగనే సీఎం.. మరో సంచలన సర్వే.. న్యూస్ ఎరేనా సర్వేలో వైసీపీ సీట్ల లెక్క ఇదే!

News Arena India: ఏపీలో అధికార వైసీపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఆ పార్టీ అధినేత జగన్ తనదైన సిద్దం సభలను మొదట నిర్వహించి పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆ తర్వాత...
- Advertisement -
- Advertisement -