Priyanka Singh: పెళ్లి చేసుకోబోతున్న ట్రాన్స్ జెండర్.. వైరల్ అవుతున్న హల్దీ ఫొటోస్?

Priyanka Singh: బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా బుల్లితెర కార్యక్రమం జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్లు పరిచయమయ్యారు. అయితే ఈ కార్యక్రమం మొదట్లో మగవాళ్ళు మాత్రమే సందడి చేసేవారు.మగవారే లేడీ గెటప్స్ లో పెద్ద ఎత్తున సందడి చేసేవారు ఇలా లేడీ గెటప్స్ లో సందడి చేసిన వారిలో సాయి తేజ ఒకరు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా లేడీ గెటప్స్ వేసిన సాయి తేజ చివరికి ట్రాన్స్ జెండర్ గా మారిపోయారు.

ఇలా ట్రాన్స్ జెండర్ గా మారిన ఈమె సాయి తేజ నుంచి ప్రియాంక సింగ్ గా తన పేరును మార్చుకున్నారు. ఇక ప్రియాంక సింగ్ అయిన తర్వాత తనకు ఎంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పాలి. ఇలా ట్రాన్స్ జెండర్ గా ఈమె బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ గా వెళ్లారు. ఈ కార్యక్రమంలో తన ఆట తీరుతో తన అందంతో అందరిని మెప్పించిన ఈమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రియాంక సింగ్ బుల్లితెర నటుడు మానస్ తో లవ్ ట్రాక్ నడిపిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఇదంతా కేవలం బిగ్ బాస్ షో వరకు మాత్రమేనని మనకు అర్థమైంది.బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రియాంక సింగ్ పలు టీవీ షోలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా టీవీ షోల ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం సోషల్ మీడియాలో కూడా తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేశారు. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తాను ఒక వ్యక్తి కోసమే ట్రాన్స్ జెండర్ గా మారానని చివరికి తనను మోసం చేశారని ఈమె తన లవ్ విషయం చెప్పిన సంగతి మనకు తెలిసిందే.

ఇదిలా ఉండగా తాజాగా ప్రియాంక సింగ్ తన సోషల్ మీడియా వేదికగా తన తల్లిదండ్రులతో కలిసి పూజ చేస్తున్నటువంటి ఫోటోని షేర్ చేసి ఇట్స్ డన్ అంటూ ఫోటోని షేర్ చేశారు.అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా హల్ది ఫంక్షన్ చేసుకున్నటువంటి వీడియో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇది చూసిన నేటిజన్ లు ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోబోతోందా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఎంతో మంది ఈమెకు ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు.

ఇక ఈ ఫోటోలు వైరల్ కావడంతో ప్రియాంక నిజంగానే పెళ్లి చేసుకుంటున్నారా లేకపోతే ఒక ఫోటో షూట్ లో భాగంగా ఇలా ఫోటోషూట్ చేయించుకున్నారా.. లేదంటే ఏదైనా ఇతర కార్యక్రమాల కోసం ఇలా షూట్ చేశారా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇప్పటివరకు అయితే ఈమె ఎక్కడ కూడా తన పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ అధికారకంగా ప్రకటించకపోయిన ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ కావడంతో చాలామంది ప్రియాంక సింగ్ పెళ్లి చేసుకోబోతున్నారని భావిస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -