Bigg Boss:ఆ కంటెస్టెంట్ కు బిగ్ బాస్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందా?

Bigg Boss: బిగ్‌బాస్ ఆరో సీజన్ అంతగా ఆకట్టుకోవడం లేదు. ఈ షోను చూస్తున్న వారికి తెగ బోర్ కొట్టిస్తోంది. టాప్ కంటెస్టెంట్‌గా దూసుకుపోతున్న గలాటా గీతు గత వారం ఎలిమినేట్ కావడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. కావాల్సినంత కంటెంట్ ను, ఎంటర్ టైమ్ మెంట్ ను అందించే గీతు హౌస్ నుంచి వెళ్లిపోవడంతో ఎవరికీ బిగ్ బాస్ చూడాలనే ఇంట్రెస్ట్‌ రావడం లేదు. ఆమె వెళ్లిపోయిన తర్వాత మళ్లీ గాడిలో పడుతుందేమోనని అందరూ అనుకుంటున్నారు. కానీ పరిస్థితులు చూస్తే అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.
ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్లకు ఆటను ఎలా రక్తికట్టించాలో తెలియడం లేదని అందరూ కామెంట్లు చేస్తున్నారు. హౌస్ మేట్స్ ఒకరి ఆటపై ఇంకొకరు దృష్టి పెడుతున్నారు. ఇక మేల్ కంటెస్టెంట్లు ఎంతసేపు ఫీమేల్ కంటెస్టెంట్ల మీద దృష్టి పెడుతూ గేమ్ ఆడటాన్ని మర్చిపోతున్నారు. ఇలా మొన్నటి వరకు శ్రీసత్య మాయలో పడిన అర్జున్ ఆట సరిగ్గా ఆడకపోవడంతో చివరకు ఎలిమినేట్ అయ్యాడు.
శ్రీసత్య మాయలో పడినట్లే!
అర్జున్ ఎలిమినేట్ అయిన తర్వాత శ్రీసత్య మాయలో శ్రీహాన్ పడిపోతున్నట్లే కనిపిస్తోంది. ఆమె కోసం త్యాగాలు చేస్తూ పూర్తిగా గేమ్ ఆడటాన్ని శ్రీహాన్ పక్కనపెట్టేసినట్లే కనిపిస్తోంది. దీంతో మనోడి ఆటపై తీవ్రమైన స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ చేసిన ఓ పని ఆయనకు మంచి అవకాశాన్ని ఇచ్చింది.
సిరి ఏం చెప్పింది?
రీసెంట్ గా కంటెస్టెంట్స్ తో విత్ స్టార్ పరివారం అనే ప్రోగ్రామ్ ను స్టార్ట్ చేశారు. ఇందులో సీజన్–4, సీజన్–5 కంటెస్టెంట్ల మధ్య ఓ పోటీ పెట్టారు. ఇందులో బిగ్ బాస్ సిరి కూడా ఉన్నారు. అయితే సిరి ఎలా ఉన్నావని, శ్రీహాన్ కు ఏం చెబుతావని బిగ్ బాస్ అడుగుతాడు. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. సీజన్ 5లో షణ్ముఖ్ తో రొమాన్స్ చేసి పరువు పోగొట్టుకున్న సిరి.. ఒకవేళ శ్రీహాన్ గురించి పాజిటివ్ గా చెబితే ఆయన టాప్ రేసులోకి వచ్చే ఛాన్సుంది. తద్వారా టైటిల్ గెలిచే అవకాశాలు ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -