Divi Vadthya: కాస్టింగ్ కౌచ్ గురించి దివి సంచలన కామెంట్

Divi Vadthya: సినిమాలు అంటే కేవలం హంగులు, ఆర్భాటాలు మాత్రమే కాదు. వాటి వెనక ఎంతో మంది కష్టాలు ఉంటాయి. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యన వెలుగులోకి వచ్చి, సంచలనంగా మారింది.. కాస్టింగ్ కౌచ్. కొత్తగా సినిమాల్లోకి రావాలని చూసే నటీనటులకు అవకాశాల పేరుతో లొంగపరుచుకునే ఈ తంతు మీద ఇండస్ట్రీలో తీవ్ర దుమారమే రేగింది.

సినిమాల్లో అవకాశాలు రావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందనే చర్చకు కాస్టింగ్ కౌచ్ దారి తీసింది. కాస్టింగ్ కౌచ్ కు ఎంతో మంది నటీనటులు బలికాగా.. ఈమధ్యన చాలామంది దీనికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. అయితే తాజాగా చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించిన దివి కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్ చేసింది. ఇప్పుడు ఇండస్ట్రీలో దివి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అయ్యాయి.

దివి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. ‘కమిట్ మెంట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. మమ్మల్ని అడగలేదని ఎవరైనా అంటే పెద్ద నిజం కాదు. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ విషయం ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కొందరికి కెరియర్ లో ఎదగాలి అని ఉంటుంది. వారు ఇలాంటి విషయాలు పట్టించుకోరు. అడగ్గానే లొంగిపోతారు’ అని చెప్పింది.

ఇలా కాస్టింగ్ కౌచ్ గురించి ఒక వర్గం వారు సులభంగా లొంగిపోతారని చెప్పిన దివి.. ‘మరికొందరు ఆ పని చేయటానికి మనసొప్పక సున్నితంగా తిరస్కరిస్తారు. అయితే ఎవరైనా ఇష్టం ఉండి కమిట్ అయితే నా దృష్టిలో అది పెద్ద తప్పు కాదు. ఇష్టం లేకపోయినా బలవంతం పెట్టడం మాత్రం పెద్ద తప్పు’ అని కామెంట్ చేసింది. మొత్తంగా దివి కాస్టింగ్ కౌచ్ లో భాగంగా కమిట్మెంట్ ఇవ్వడం ఇష్టపూర్వకంగా అయితే తప్పు లేదు అని కామెంట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా అయింది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -