Bigg Boss: నాగ్ నిజస్వరూపం బయటపెట్టిన గీతూ.. అలాంటి వారా?

Bigg Boss: బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-6 కొంత నీరసంగా కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత మెల్లమెల్లగా ట్రాక్‌లోకి వచ్చింది. అయితే కంటెస్టెంట్ల అతి తెలివి వల్ల షో చిరాకుగా అనిపించింది. దీంతో అసలు ఈసారి సీజన్ ఏమీ బాగాలేదని, కంటెస్టెంట్లు పూర్తి స్థాయిలో ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం లేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఊహించని విధంగా ఎలిమినేషన్ల పర్వం కొనసాగుతుండటంతో ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. బిగ్‌బాస్ హౌజ్‌లో 9 వారాలపాటు ఉండి.. గత వారం ఎలిమినేట్ అయింది గీతూ రాయల్. ఎలిమినేషనై బయటికొచ్చిన గీతూ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన ఎలిమినేషన్‌కు గల కారణాలు, బిగ్‌బాస్ హౌజ్‌ పరిస్థితులపై ఓపెన్ అయింది.

 

బిగ్‌బాస్ షోకు ఎంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. నార్మల్‌ టీఆర్‌పీతో దూసుకెళ్తోంది. అయితే తాజాగా ఈ షోపై గీతూ రాయల్ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ కావడాన్ని తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తన యూట్యూబ్ ఛానెల్‌లో ఓ వీడియోను కూడా పోస్ట్ చేసింది. చిన్నప్పటి నుంచి తనను ఎంతో మంది వెన్నుపోటు పొడిచారని, అలాంటి వాళ్లను తన లైఫ్‌లో చాలా మందిని చూశానని గీతూ చెప్పుకొచ్చింది. చివరికి బిగ్‌బాస్‌లో కూడా అదే సీన్ రిపీట్ అయిందని తెలిపింది. షోలో తనను నాగార్జున బాగా పొగిడేవారని పేర్కొంది. అప్పుడు నేను ఎంతో తోపునా అని ఫీల్ అయ్యానని, కానీ నాగార్జున తోపు.. తోపు అంటూనే చివరకు నిండా ముంచారని ఆవేదన వ్యక్తం చేసింది.

బిగ్‌బాస్ హౌజ్ నుంచి బయటికొచ్చిన గీతూ.. పెద్దగా ఇంటర్వ్యూల్లో పాల్గొనలేదు. తన యూట్యూబ్ ఛానల్‌లో మాత్రమే మాట్లాడింది. బిగ్‌బాస్ హౌజ్‌ నుంచి బయటికి వచ్చినప్పుడు ఎలా అనిపించింది? తను చేసిన తప్పులపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించింది. అలాగే హౌజ్ విషయాలే కాకుండా బయటి విషయాలు చెప్పుకొచ్చింది. హౌజ్‌లోకి వచ్చే ముందు తనని ప్రమోట్ చేయమని కొందరికి రూ.25 వేలు ఇచ్చానని, వాళ్లు డబ్బులు తీసుకుని మోసం చేశారని పేర్కొంది. ఆఖరికి నమ్మిన స్నేహితులు కూడా తనని మోసం చేసినట్లు గీతూ ఎమోషనల్ అయింది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -