Bipasha Basu: ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాసా బసు.. ఎమోషనల్ పోస్ట్!

Bipasha Basu: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాసా బాసు- స్టార్ యాక్టర్ కరణ్ సింగ్ గ్రోవర్ తల్లిదండ్రులయ్యారు. తాజాగా ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాప పుట్టడంతో అమ్మను అయ్యానని బిపాసా ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన పాపకు సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. బిపాసా బాసు-కరణ్ సింగ్ గ్రోవర్‌కు పాప పుట్టడంతో తమ అభిమానులు ఎంతో సంబర పడుతున్నారు. ఈ మేరకు బాలీవుడ్ సెలబ్రిటీలు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

 

బాలీవుడ్ నటి బిపాసా బసు.. అప్పట్లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగారు. బాలీవుడ్‌లో చాలా వరకు థ్రిల్లర్, హర్రర్ సినిమాల్లో నటిస్తూ.. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణే దక్కించుకున్నారు. ఫ్యాషన్ మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన బిపాసా.. 2001లో ‘అజ్‌నబీ’ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. దీంతో బాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు పెరిగాయి. చాలా వరకు హిట్ సినిమాలలో నటించడం వల్ల స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. హీరో కరణ్‌తో కలిసి బిపాసా 2014లో ‘అలోన్’ సినిమాలో నటించింది. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. దాంతో 2016లో పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కాగా, ఆగస్టు నెలలోనే బిపాసా ప్రెగ్నెంట్ అన్న విషయం బయటికి వచ్చింది. నవంబర్ 11న ఈ సెలబ్రిటీ జోడికి పండంటి పాప పుట్టింది.

 

 

పాపకు జన్మనివ్వడంతో ఎంతో సంతోషంగా ఉన్నట్లు బిపాసా బసు చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో తన కూతురి చిట్టి పాదాలను చూపిస్తూ.. ఫోటోలను షేర్ చేసింది. పాప పేరును ‘దేవి బసు సింగ్ గ్రోవర్’ అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా బిపాసా మాట్లాడుతూ.. ‘దేవి పుట్టడం ఎంతో సంతోషంగా ఉంది. మా ప్రేమకు ప్రతిరూపం తను. అందరి ఆశీస్సులు పాపకు ఇవ్వండి.’ అని ఎమోషనలై పేర్కొంది. కాగా, ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -