AP: విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలోకి దిగనున్న బీజేపీ సీనియర్ నేత?

AP: ఏపీలో కీలకమైన విజయవాడ ఎంపీ స్థానానికి చాలా గుర్తింపు ఉంది. ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన వారికి ఏపీ రాజకీయాల్లో మంచి పలుకుబడి ఉంటుంది. రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలో ఈ నియోజకవర్గం ఉండటం విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని అన్ని పార్టీలు కీలకంగా తీసుకుంటాయి. అలాగే ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు బలమైన నేతలు, వ్యాపారవేత్తలు ఆసక్తి చూపుతోన్నారు. పార్టీలు కూడా ఆర్ధికంగా బలంగా ఉన్న నేతలకే విజయవాడ ఎంపీ సీటును కేటాయిస్తూ ఉంటాయి. ఇప్పటివరకు పార్టీలన్నీ కూడా ఆర్ధిక, అంగ బలం ఉన్న నేతలకు ఇక్కడ నుంచి టికెట్ ఇచ్చాయి.

 

ప్రస్తుతం విజయవాడ ఎంపీగా కేశినేని నాని ఉండగా.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. కేశినేని నాని అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. దీంతో విజయవాడ టీడీపీ ఎంపీ టికెట్ కోసం కొత్త వ్యక్తి పేరు రేసులో వినిపిస్తోంది. ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి వచ్చే ఎన్నికల్లో విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతారనే ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఆయన బీజేపీలోనే ఉండగా.. ఏపీలో బీజేపీ పుంజుకునే అవకాశం లేకపోవడంతో ఎన్నికల నాటికి టీడీపీలోకి వచ్చే అవకాశముందని అంటున్నారు.

 

 

టీడీపీ అధినేత చంద్రబాబుకు కుడి భుజంగా సుజనా చౌదరికి పేరు ఉంది. చంద్రబాబుకు అత్యంత నమ్మకస్తుడిగా ఆయనకు పేరుంది. బీజేపీలోకి వెళ్లినా.. చంద్రబాబుతో సంబంధాలు కొనసాగిస్తోన్నారు. బీజేపీలోని కొంతమంది నేతలు టీడీపీని విమర్శిస్తుండగా.. సుజనా చౌదరి మాత్రం ఎప్పుడూ విమర్శించలేదు. అంతేకాకుండా చంద్రబాబే సుజనా చౌదరిని బీజేపీలోకి పంపించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

 

అయితే మళ్లీ టీడీపీలోకి వచ్చేందుకు సుజనా చౌదరి ఆసక్తి చూపుతున్నారని, ఇప్పటికే తన దూతలను చంద్రబాబు దగ్గరకు పంపారనే వార్తలు వస్తోన్నాయి. ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కూడా సుజనా చౌదరిని కలిసినట్లు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన రాజ్యసభ పదవి కాలం ముగిసింది. ఆ తర్వాత సుజనా చౌదరికి బీజేపీ ఎలాంటి పదవి ఇవ్వలేదు. దీంతో టీడీపీలోకి వచ్చే ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -