BJP: 144 లోక్ సభ స్థానాలపై బీజేపీ ఫోకస్.. అసలు ప్లాన్ ఇదే

BJP: 2014, 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటినుంచే కసరత్తులు చేస్తోంది. రెండుసార్లు వరుసగా బీజేపీ గెలవడంతో.. ప్రధాని మోదీ వరుసగా రెండుసార్లు పీఎం పీఠంపై కూర్చున్నారు. వచ్చే 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా గెలిచి సత్తా చాటాలని బీజేపీ చూస్తోంది. ఇప్పటినుంచే వ్యూహలు రచిస్తోంది. మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని కేంద్రంలోని బీజేపీ చూస్తోంది. దాని కోసం అనేక స్కెచ్ లు వేస్తోంది. ఏడాదిన్నర ముందుగానే ఎన్నికలకు సిద్దం అవుతోంది.

ఈ క్రమంలో ఇప్పటివరకు గెలవని, ఓడిపోయిన 144 స్థానాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దేశంలో 547 స్థానాలు ఉండగా.. అయితే 110 స్థానాల్లో అసలు బీజపీ పోటీ చేయలేదు. పొత్తుల్లో భాగంగా ఇతరులు కేయటాించింది. ఈ క్రమంలో ఇప్పటివరు గెలవని, ఓడిపోయిన 144 స్థానాల్లో ఈ సారి కొన్నింటినైనా గెలుచుకోవాలని బీజేపీ చూస్తోంది. పార్టీ బలంగా ఉన్న ఈ 144 లోక్ సభ స్థానాల్లో పాగా వేసేందుకు వ్యూహలు రచిస్తోంది. 40 నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ స్వయంగా ప్రచారం చేయనున్నారు. ఇక్కడ భారీ బహిరంగ సభలు నిర్వహించేందుుకు బీజేీపీ సిద్దమవుతోంది.

ఇక మిగిలిన 104 నియోజకవర్గాల బాధ్యతలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేబినెట్ మంత్రులకకు అప్పగించారు. ఒక్కో లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక్కో కస్టర్ గా విభజించి ఒక్కో కస్టర్ ు ఒక కేంద్రమంత్రిని బాధ్యునిగా అప్పగించారు. స్థానిక లోక్ సభ స్థానాల్లో ప్రముఖ నేతలతో సమావేశాలు నిర్వహించడం, అసంతృప్త నేతలను బుజ్జగించడం, పార్టీ బలోపేతం చేయడం లాంటివి చేస్తూ ఉండాలి. గత లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయేకు 353 స్థానాలు వచ్చాయి. ఇక కాంగ్రెస్ కు 52, యూపీఏకు 91 స్థానాలు వచ్చాయి. ఇక ఇతర పార్టీలకు 98 సీట్లు వచ్చాయి.

ఈ సారి గత రెండు లోక్ సభ ఎన్నికలకంటే అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ చూస్తోంది. అందుకే పార్టీ బలంగా ఉన్న స్థానాలకంటే దేశవ్యాప్తంగా బలహీనంగా ఉన్న 144 నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి అక్కడ బలపేడుందుకు కసరత్తులు చేస్తోంది. ఎక్కడ పొగోట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే ప్లాన్ ను బీజేపీ చూస్తోంది. అందుకే పార్టీ బలహీనంగా ఉన్న, గతంలో ఓడిపోయిన లోక్ సభ నియోజకవర్గాలను ఎంపిక చేసుకుంది. ఇక్కడ కనీసం 40 నియోజకవర్గాలను గెలుచుకున్నా ఈ సారి అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రావొచ్చని భావిస్తోంది. మరి ఆ 144 నియోజకవర్గాల్లో బీజేపీ స్కెచ్ ఫలిస్తుందా.. లేదా అనేది చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -