BJP: ఏపీలో టీడీపీ, వైసీపీలకు బీజేపీ షాక్.. ఆ నాలుగు ఎంపీ స్థానాలపై ఫోకస్

BJP:  ఏపీలో బీజేపీ అంత బలంగా లేదు. కేంద్ర అధినాయకత్వం కూడా ఏపీని లైట్ గా తీసుకుంది. ఇప్పట్లో ఏపీలో బీజేపీ బలపడే అవకాశాలు అసలు లేవు. అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ బలంగా ఉన్నాయి. ఇక పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కూడా బలంగా ఎదుగుతోంది. ఇక కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలుకు కూడా కాస్త ఓటు బ్యాంకు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చని బీజేపీని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్ధితుల్లో లేరు. గత ఎన్నికల్లో బీజేపీకి ఒక్కచోట కూడా డిపాజిట్లు దక్కలేదు. ఈ సారి కూడా అలాంటి ఫలితాలు రిపీట్ అయ్యే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నారు.

కానీ ఏపీలో సొంతంగా బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా బలహీనంగా ఉన్న 144 పార్లమెంట్ స్థానాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అందులో ఏపీలోని నాలుగు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయని తెలుస్తోంది. విశాఖ, తిరుపతి, విజయవాడ, నర్సాపురం స్థానాలు ఉన్నట్లు సమాచారం. ఈ నాలుగు స్థానాల్లో గతంలో బీజేపీ గెలిచింది. 2014లో టీడీపీతో పొత్తులో భాగంగా బీజేపీ నుంచి హరిబాబు విజయం సాధించారు. ఇక నర్సాపురం నుంచి కృష్ణంరాజు గతంలో బీజేపీ తరపున ఎంపీగా గెలుపొందారు. ఇక గతంలో విజయవాడ, తిరుపతి స్థానాల్లో కూడా ఒకసారి బీజేపీ గెలిచింది. దీంతో ఈ నాలుగు స్థానాల్లో బీజేపీకి కాస్త బలం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలుపొందేందుకు సమయాత్తం అవుతోంది.

ఈ పార్లమెంట్ స్థానాల్లో బలపడేందుకు బీజేపీ కసరత్తులు చేస్తోంది. మేధావులు, ప్రజా సంఘాలు, విద్యావేత్తలు, వివిధ సంఘాల వారితో సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుతుంది. అక్కడ సర్వేలు చేయిస్తూ బీజేపీ బలోపేతానికి నేతలు కృషి చేస్తున్నారు. వీలైనన్నీ ప్రయోగాలు అక్కడ చేయాలని బీజేపీ నిర్ణయించింది. టీడీపీతో పొత్తు ఉన్నా.. లేకున్నా ఈ నాలుగు పార్లమెంట్ స్థానాల్లో బలపడేందుకు బీజేపీ చూస్తోంది. విశాఖపట్నంలో బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మకాం వేశారు. అక్కడే ఉంటూ బీజేపీ స్థానిక నేతలు, క్యాడర్ తో టచ్ లో ఉంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో విశాఖ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా జీవీఎల్ నరసింహరావు పోటీ చేసే అవకాశముందని తెలుస్తోంది. అందుకే జీవీఎల్ ఈ మధ్య విశాఖలోనే ఉంటున్నారని చెబుతున్నారు. ఇక విజయవాడ, తిరుపతి, నర్సాపురంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అక్కడ బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సొంతగా కష్టపడితే ఆ నాలుగు స్థానాలను గెులుపొందవచ్చే ఆలోచనలో బీజేపీ ఉంది. ఇక న ర్సాపురం నుంచి ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజును బరిలోకి దింపాలని బీజేపీ చూస్తోంది. రాఘురామకృష్నంరాజు ప్రస్తుతం వైసీపీకి దూరంగా ఉన్నారు. గతంలో బీజేపీలో ఆయన ఉన్నారు.

బీజేపీ నేతలతో ఆయనకు మంచి సత్సంబంధాలు కూడా ఉన్నాయి. దీంతో రఘురామకృష్ణంరాజును బరిలోకి దింపాలనే యోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విజయవాడ, తిరుపతి పార్లమెంట్ స్థానాలకు బలమైన అభ్యర్థులను పోటీలోకి దింపాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Bandla Ganesh-Roja: రోజా పులుసు పాప.. బండ్ల గణేష్ లేకి వ్యాఖ్యలు ఎంతవరకు రైట్ అంటూ?

Bandla Ganesh-Roja: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అదే విధంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -
- Advertisement -