BJP: మూడు రాష్ట్రాలపై కన్ను.. బీజేపీ వలలో చిక్కుకుంటారా?

BJP: ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఢిల్లీలో జరిగిన లిక్కర్ కుంభకోణం కేసులో తెలుగు రాష్ట్రాల లింకులు బయపడ్డాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా లిక్కర్ కుంభకోషం ప్రకపంనలు రేపుతోంది. ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారవేత్తపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు ఉన్నారనే వార్తలు సంచలనం రేపుతోన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవిత, ఏపీకి సంబంధించిన వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడితో పాటు వైసీపీ నేత మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇది జరుగుుతండగానే సీఎం వైఎస్ జగన్ వెంటనే ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

లిక్కర్ కుంభకోణం కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఏ1గా ఉండగా.. తాజాగా ఆయన సంచలన విషయం బయపెట్టారు. బీజేపీలో చేరాలని తనపై ఆ పార్టీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారని, చేరనందుకే తనపై సీబీఐ కేసు పెట్టించారని సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ ను చీల్చి నేతలను బీజేపీలోకి తీసకొస్తే సీఎంగా అవకాశమిస్తామని కాషాయ పార్టీ ఆఫర్ ఇచ్చినట్లు బయటపెట్టారు. కానీ ప్రాణం పోయినా తాను బీజేపీలో చేరనని, కట్ట కాలే వరకు ఆప్ లోనే ఉంటానన్నారు. మహారాష్ట్ర తరహాలో ఢిల్లీలో కూడా ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో మోదీ, అమిత్ షా ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో అది ఉపయోగించుకుని రాష్ట్రాలలోని ప్రభుత్వాలను పడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీల నేతలను ప్రలోభాలకు గురి చేసి తమవైపు తిప్పుకుంటున్నారు. ఇలాంటి వ్యూహంతో రాష్ట్రాల్లోని అధికార ప్రభుత్వాలను కూల్చేస్తున్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 ఏళ్లల్లో చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఇలానే చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర.. ఇలా చాలా రాష్ట్రాల్లో అధికార ప్రభుత్వాలను పడగొట్టింది. బీజేపీ తీరుపై ప్రతిపక్ష, విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తుందని, రాష్ట్రాల్లోని అధికార ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఐటీ,ఈడీ, సీబీఐలను తమ ప్రయోజానాల కోసం ఉపయోగించుకుంటనే విమర్శలు చేస్తున్నారు.

ఇటీవల మహారాష్ట్రలో అమలు చేసిన ప్లాన్ తరహాలో ఢిల్లీలో కూడా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేసినట్లు సిసోడియా బయటపెట్టిన మాటలను బట్టి చూస్తే తెలుస్తోంది. అయితే లిక్కర్ కుంభకోణంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు ఉండటంతో ఒకే దెబ్బకు మూడు పిట్టలు అనే తరహాలో బీజేపీ రాజకీయాలకు పదును పెట్టింది.

ఎమ్మెల్సీ కవిత ఈ స్కాంలో ఉందనే ఆరోపణల క్రమంలో ఇక్కడ టీఆర్ఎస్ ను ఇరుకునపెట్టేందుకు ఈ అస్త్రాన్ని ఉపయోగించుకుంటోంది. ఇక ఏపీలో బీజేపీకి వైసీపీ మద్దతు ఇచ్చినా.. ఇటీవల కాస్త దూరం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో వైసీపీని ఇరుకున పెట్టి ఆ పార్టీ తమకు మద్దతు ఇచ్చేలా చేసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -