గుండె నొప్పితో బిగ్ బాస్ నటి ఆకస్మిక మృతి!

ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు నిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యతో మృతి చెందుతూ ఒకసారిగా అందరిని షాక్ కి గురి చేస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది అనారోగ్య సమస్యలతో మృతి చెందుతూ ఉండగా మరికొందరు కరోనా కారణం వల్ల కూడా చాలామంది చనిపోయారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య అధికమవుతుంది తాజాగా బిగ్ బాస్ కంటెస్టెంట్ కంటెంట్ క్రియేటర్ సోనాలి పోగట్ మృతి చెందారు.

ఈమె హిందీ బిగ్ బాస్ కంటెంట్ క్రియేటర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు.టిక్ టాక్ వీడియోలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తన టిక్ టాక్ వీడియోల ద్వారా అభిమానులను సందడి చేయడమే కాకుండా ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 8.8 లక్షల మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు.

ఇకపోతే హిందీ టీవీ యాంకర్ గా కూడా పనిచేసిన ఈమె యాంకర్ గా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇదిలా ఉండగా ఈమె 2020లో హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనడంతో ఈమెకు ఈ కార్యక్రమం ద్వారా మరింత మంది అభిమానులు పెరిగిపోయారు. నటిగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందడమే కాకుండా, రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చి రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే ఈమె 2019 అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఇలా రాజకీయాలలో కూడా పాల్గొని ఒకవైపు రాష్ట్ర రాజకీయాలలోను అలాగే సినిమా ఇండస్ట్రీలోనూ ఎంతో చురుగ్గా కొనసాగుతున్నటువంటి నటి సోనాలి తాజాగా గోవాలో తీవ్రమైన గుండెపోటుకు గురై మరణించారు. ఇలా ఈమె గుండెపోటుతో మరణించారని తెలియగానే ఒక్కసారిగా అభిమానులు ఎంతో షాక్ అయ్యారు. ఈమె మరణ వార్త తెలుసుకున్న అభిమానులు తన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -