BJP MLA Raja Singh: ఏడాది వరకు జైల్లోనే రాజాసింగ్? MIM స్కెచ్ వేసిందా?

BJP MLA Raja Singh: గోషామహల్ రాజాసింగ్.. ప్రస్తుతం ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. రాజాసింగ్ అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. గతంలో ఆయనపై నమోదైన రౌడీషీట్ల కేసులను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి పీడీ యాక్ట్ కేసులు నమోదవ్వడం హైదరాబాద్ లో అలర్లకు దారి తీసింది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఎమ్మెల్యేపై కూడా పీడీ యాక్ట్ కేసులు నమోదు కాలేదు. తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలోనే తొలిసారి ఒక ఎమ్మెల్యే పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయడం దుమారం రేపుతోంది.

రాజాసింగ్ అరెస్ట్ తో పాతబస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలర్లు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ర్యాపిడ్ యాక్షన్, క్విక్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలోకి దించారు. సీఆర్ఫీఎప్ పోర్స్ ను కూడా రంగంలోకి దిగి అడుగడుగున గస్తీ చేపడుతున్నారు. పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. సమస్మాత్మక ప్రాంతాల్లో భారీగా బలగాలు మోహరించాయి.

అయితే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు కావడంతో ఏడాది వరకు జైలుశిక్ష పడే అవకాశముందనే చర్చ జరుగుతోంది. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రీవోక్ చేయకపోతే ఏడాదివరకు జైల్లోనే ఉండాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టును రాజాసింగ్ ఆశ్రయించినట్లు సమాచారం. రాజాసింగ్ లీగల్ టీమ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. సోమవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చే అకాశముంది. నేరాలకు ఎక్కువగా పాల్పడే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తారు.

ఇప్పటివరకు రాజాసింగ్ పై 101 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయనపై కేసులు ఫైల్ అయ్యాయి. 101 కేసుల్లో 18 కేసులు మత విద్వేషాలు రెచ్చగొట్టినందుకు నమోదైన కేసులే ఉన్నాయి. దేశంలోనే ఇతర రాష్ట్రాల్లో 42 కేసులు నమోదయ్యాయి. గతంలో షాహినాయత్ గంజ్, మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్లలో రౌడీ షీట్లు ఉ న్నాయి. అయితే ఈ నెల 23న మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ 41సీఆర్ పీసీ నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసినందుకు కోర్టు రాజాసింగ్ కు బెయిల్ ఇచ్చింది.

అయితే మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్లలో గతంలో రాజాసింగ్ పై రౌడీషీట్స్ నమోదు అయ్యాయి. ఆ రౌడీషీట్స్ ను ఆధారంగా తీసుకుని ముందుగానే రాజాసింగ్ కు నోటీసులు జారీ చేసి అరెస్ట్ చే శారు. అయితే రాజాసింగ్ ను అరెస్ట్ చేయడం వెనుక ఎంఐఎం హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ తో కలిసి ఎంఐఎం రాజాసింగ్ పై కుట్ర పన్నిందని, అందుకే పాత కేసులను తిరిగి తెరపైకి తెచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం నడుస్తోంది

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -