CM KCR: టీఆర్ఎస్‌పై బీజేపీ కొత్త మైండ్ గేమ్.. గులాబీ శ్రేణుల్లో టెన్షన్

CM KCR: టీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కిరి చేసేలా బీజేపీ కొత్త మైండ్ గేమ్ మొదలుపెట్టింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోన్న బీజేపీ. .టీఆర్ఎస్ ను ఉక్కిరిబిక్కరి చేస్తోంది. టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే విధంగా ప్రణాళికలు రూపొందిస్తుంది. ప్రతి విషయంలోనూ టీఆర్ఎస్ ను ఇబ్బందులుకు గురి చేసి ఆ పార్టీని సైడ్ కార్నర్ చేసే విధంగా వ్యూహరచనలు చేస్తోంది. టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టడం ద్వారా ప్రజల్లో మైలేజ్ తగ్గుతుందని, పార్టీ శ్రేణులు కూడా డీలా పడిపోతారనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు ధాన్యం కొనుగోళ్లు విషయంలో టీఆర్ఎస్ ను బీజేపీ దెబ్బకొట్టగలిగింది.

తెలంగాణ విమోచన దినోత్సవాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా విలీన దినోత్సవాలను జరపాల్సిన పరిస్థితి వచ్చింది. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 8 ఏళ్లల్లో ఒక్కసారి కూడా తెలంగాణ విలీన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించలేదు. కానీ బీజేపీ కేసీఆర్ అధికారికంగా జరిపేలా చేయగలిగింది. ఇక ధాన్యం కొనుగోళ్ల విషయంలో కూడా టీఆర్ఎస్, బీజేపీ మధ్య తారాస్థాయిలో యుద్దం జరిగింది. రెండు పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విమర్శల దాడి చేసుకున్నారు. సీఎం కేసీఆర్ ఏకంగా ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీలో ధర్నా చేశారు.

కానీ చివరికి రాష్ట్లర ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు చేసేలా బీజేపీ చేయగలిగింది. ఇలా అనేక విషయాల్లోనే టీఆర్ఎస్ ను బీజేపీ ఇరుకున పెడుతూ వస్తుంది. ఇక ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ స్కాం అధికార టీఆర్ఎస్ మెడకు చిక్కుకుంది. ఏకంగా సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు కవిత, జోగినపల్లి సంతోష్ కుమార్ తో పాటు కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన సన్నిహితులకు లిక్కర్ స్కాంలో ఉన్న లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈడీ తవ్వకొద్ది డొంక కదులుతోంది. ఇప్పటికే కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన సన్నిహితులకు ఈడీ నోటీసులు అందజేసింది. విచారణ కోసం ఢిల్లీ రావాలని పిలిచింది.

త్వరలోనే కవితకు కూడా ఈడీ నోటీసులు వచ్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. దీంతో తెలంగాణ బీజేపీ ఈ విషయం గురించి టీఆర్ఎస్ పై కొత్త మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. కవితకు త్వరలోనే ఈడీ నోటీసులు వస్తాయని, ఆమె అరెస్ట్ కావం ఖాయమంటూ ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఈ వ్యాఖ్యల ద్వారా టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతల ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంది. కానీ ఇప్పటికే లిక్కర్ స్కాంలో కవితకు సంబంధించి నసన్నిహితుల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో గులాబీ వర్గాలు కూడా బీజేపీ నేతల వ్యాఖ్యలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సిండికేట్లకు డబ్బులు తెలంగాణ నుంచే వెళ్లాయని, వివిధ షెల్ కంపెనీల నుంచి వెళ్లినట్లు ఈడీ గుర్తించింది. దీంతో లిక్కర్ స్కాంపై బీజేపీ నేతలు ఆరోపణలను మరింత పెంచారు. దీంతో బీజేపీ ఆరోపణలకు సమాధానాలు చెప్పలేక టీఆర్ఎ్ నేతలు సైలెంట్ గా ఉండిపోతున్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం టీఆర్ఎస్ వెనక్కి తగ్గడం లేదు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉంది. మోదీ విధానాలను టీఆర్ఎస్ సోషల్ మీడియాలో గట్టిగానే ఎండగడుతున్నారు. మంత్రి కేటీఆర్ కూడా తన ట్విట్టర్ ద్వారా మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉననారు.

కానీ ఇతర పార్టీల నేతలు మాత్రం ఈ పరిణామాలను గమనిస్తూ సైలెంట్ గా ఉన్నారు. టీఆర్ఎస్, బీజేపీ ట్రాప్ లోకి తాము ఎందుకకు అని కాంగ్రెస్, మిగతా పార్టీలు గుంభనంగా ఉంటున్నాయి. అయితే టీఆర్ఎస్ మాత్రం బీజేపీని లిక్కర్ స్కాంలో ఎలా డీల్ చేయాలో తెలియక సమతమవతమవుతోంది. ఈడీ దాడుల విషయంలో ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక టీఆర్ఎస్ సైలెంట్ గా ఉండిపోయింది.

Related Articles

ట్రేండింగ్

Governor Tamilisai: నాపై రాళ్లు వేస్తే వాటితో ఇల్లు కట్టుకుంటా.. గవర్నర్ తమిళిసై విమర్శలు మామూలుగా లేవుగా!

Governor Tamilisai: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై కెసిఆర్ ప్రభుత్వం మద్య తరచు వివాదాలు చోటుచేసుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కెసిఆర్ ప్రభుత్వం తరచు ఈమెపై విమర్శలు వర్షం కురిపిస్తూ ఉంటారు. అయితే...
- Advertisement -
- Advertisement -