Munugode By-Poll: తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. పార్టీలన్నీ ఇక్కడ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో మునుగోడు ఉపఎన్నిక రక్తికట్టిస్తుంది. పార్టీలన్నీ ఇక్కడ గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరి వ్యూహలతో వారు ముందుుకు వెళ్తున్నారు. దీంతో మునుగోడులో అధికార టీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ మధ్య రసవత్తర పోటీ నెలకొంది. తాజాగా టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి ప్రచారంలోకి దిగడంతో మునుగోడులో రాజకీయం మరింత వేడెక్కింది. గత కొంతకాలంగా మనుగోడపై సైలెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి.. తాజాగా అక్కడ ప్రచారం నిర్వహించారు. దీంతో బీజపీ కూడా అప్రమత్తమైంది.
టీఆర్ఎస్, కాంగ్రెస్ కు అక్కడ చెక్ పెట్టేందుకు బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలు ఉన్నాయి. చౌటుప్పల్, నారాయణపురం, మర్రిగూడ, నాంపల్లి, చండూరు, మునుగోడు మండలాలు ఉన్నాయి. అన్ని మండలాలకు ఇంచార్జ్, సహ ఇంచార్జ్ లను బీజేపీ నియమించింది. ప్రతి మండలానికి సీనియర్ నేతలను ఇంచార్జ్, సహ ఇంచార్జ్ లను నియమంచి వారికి ఎన్నికల గెలుు బాధ్యతలను అప్పగించింది. చౌటుప్పల్ మండలానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, సహా ఇంచార్జ్ లుగా జిట్టా బాలకృష్ణారెడ్డి, నేషనల్ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు రాములును నియమించింది.
ఇక చౌలుప్పల్ మున్సిపాలిటీకి ఇంచార్ంజ్ గా మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, సహ ఇంచార్జ్ లుగా ధనుంజయ, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ సుబాస్ చందర్ లను నియమిస్త బీజేపీ ప్రకటన విడుదల చేసింది. ఇక నాంపల్లి మండలానికి ఇంచార్జ్ లుగా అందె శ్రీరాములు యాదవ్, సహ ఇంచార్జ్ లుగా రితేశ్ రాథోడ్ లను నియమించింది. అలాగే నాయణపూర్ మండలానికి ఇంచార్జ్ గా ఎమ్మల్యే రఘునందన్ రావు, సహ ఇంచార్జ్ లుగా రమేశ్ రాథోడ్, కాంస వెంకటేశ్వర్లను నియమించింది. ఇక కీలకమైన మునుగోడు నియోజకవర్గానికి ఇంచార్ంజ్ గా చాడ సురేశ్ రెడ్డి, సహ ఇంచార్జ్ లుగా బొడిగె శోబ, రివికుమార్ యాదవ్ లను నిమించింది.
మునుగోడులో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రభుత్వ వైఫల్యాలపై పత్రాలు విడుదల చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ప్రతి ఇంటికి ఈ పత్రాలను పంపిణీ చేయనుంది. దీని వల్ల టీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరుగుతుందని అంచాన వేస్తోంది. ఇక మునుగోడు నియోజకవర్గానికి ప్రత్యేకంగా మేనిఫోస్టో విడుదల చేయాలని బీజేపీ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిధులను కేసీఆఱ్ సర్కార్ డైవర్ట్ చేయడం, కేంద్ర నిధులను అందింకుడా చేయండం లాంటి అంశాలను ఫోకస్ చేయాలని బీజేపీ చూస్తంది. దసరా తర్వాత ప్రతి ఇంటికి బీజేపీ నేతలు వెళ్లేలా కమలదళం ప్లాన్ చేసింది.
దసరా తర్వాత మరింత స్పీడ్ పెంచాలని కమల వర్గాలు భావిస్తున్నారు. ప్రతి ఇంటికి ఇంచార్జ్ లు, సహ ఇంచార్జ్ లు వెళ్లాలా వ్యూహరచన చేస్తోంది. దసరా తర్వాత మరింత స్పీడ్ పెంచాలని నిర్ణయించింది.