Rahul Gandhi: డ్రెస్సింగ్ ల వైపుగా దేశ పాలిటిక్స్.. రాహుల్, మోదీల దుస్తులపై రచ్చ రచ్చ

Rahul Gandhi:  దేశ రాజకీయాలు ప్రస్తుతం డ్రెస్సింగ్ ల వైపు తిరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య నేతల డ్రెస్సింగ్ లపై మాటల యుద్దం జరుగుతోంది. రాహుల్, మోదీ దుస్తుల చుట్టూ రాజకీయ వివాదం చెలరేగింది. రాహుల్, మోదీ డ్రెస్సింగ్ స్ట్రైల్ పై చిచ్చు రేపుతోంది. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. రాహుల్ దుస్తులపై బీజేపీ… మోదీ దుస్తులపై కాంగ్రెస్ ల మధ్య ట్విట్టర్ వేదికగా పెద్ద వార్ నడుస్తోంది. ఒకరి దుస్తులపై ఒకరు మాటల దాడి చేసుకుంటూ ట్రోల్స్ చేసుకుంటున్నారు. ప్రజల సమస్యలను వదిలేసి నేతల దుస్తులపై విమర్శలు చేసుకోవడం నెటిజన్లకు చిరాకు తెప్పిస్తుంది.

రాహుల్ టీ షర్ట్ పై బీజేపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ పెట్టడంతో ఈ చిచ్చు రేగింది. ప్రస్తుతం భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు విడతల వారీగా పాదయాత్ర చేయనున్నారు. కన్యాకుమారిలో మూడు రోజుల క్రితం ఈ పాదయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం తమిళనాడులో పాదయాత్ర జరుగుతుండగా.. త్వరలో కేరళలోకి అడుగుపెట్టనుంది. ఈ పాదయాత్రలపై మోదీ వైఫల్యాలను ఎండగడుతున్నారు.ఈ పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.

ధరల పెరుగుదలపై మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రాహుల్ ముందుకెళ్తున్నారు. అయితే రాహుల్ పాదయాత్రలో చేసిన విమర్శలకు కౌంటర్ ఇవ్వాల్సింది పోయిన బీజేపీ కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. రాహుల్ టీ షర్ట్ పై ఆరోపణలు మొదలుపెట్టింది. రాహుల్ వేసుకున్న టీ షర్ట్ ధర రూ.42 వేలు అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ వైరల్ మారింది. దీంతో కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ కూడా దీనికి గట్టిగా కౌంటర్ ఇస్తుంది. ప్రధాని మోదీ డ్రెస్సింగ్ పై ట్రోల్స్ చేస్తుంది. మోదీ ధరించే దుస్తుల విలువ లక్షల్లో ఉంటుందని, ప్రధాని ప్రజాధనంతో దుస్తులు కొంటున్నారని ట్రోల్స్ చేస్తోంది.

రాహుల్ గాంధీ తన సొంత డబ్బులతో కొనుక్కుంటే తప్పేంటి అని కాంగ్రెస్ కౌంటర్లు ఇస్తుంది. దేశానికి మూడు ప్రధానులను ఇచ్చిన కుటుంబంలో ఓ వ్యక్తి కాస్త క్వాలిటీ టీ షర్ట్ వేసుకుంటే తప్పేంటి అని కౌంటర్ ఇస్తోంది. ప్రజా సమస్యలపై చర్చను వదలేసిన దుస్తులపై రాజకీయం ఏంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీ మధ్య ప్రస్తుతం ట్విట్టర్ లో దీనిపై పెద్ద యుద్దమే జరుగుతోంది.

కానీ ఇందులో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తు్న్నారు. రాహుల్ పాదయాత్రను సైడ్ చేసి ప్రజల్లో దాని గురించి చర్చ జరగకుండా ఉండేందుకు ఇలా టీ షర్ట్ విషయాన్ని తెరపైకి తెచ్చి డైవర్ట్ చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ పాదయాత్రకు భారీ స్పందన వస్తోంది. అందుకే డైవర్ట్ చేసేందుకు టీ షర్ట్ గురించి చర్చను బీజేపీ తెరపైకి తెచ్చిందని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -