Rajasingh: రాజాసింగ్ విషయంలో బీజేపీ కీలక నిర్ణయం? మునుగోడు బై పోల్ తర్వాత డెసిషన్?

Rajasingh:  తెలంగాణలో రాజాసింగ్ అరెస్ట్ వ్యవహారం కాక రేపుతూనే ఉంది. ఆయనను విడుదల చేయాలంటూ హిందూ సంఘాలు, అభిమానులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఆయన భార్య ఉషా సింగ్ బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయ పోరాటం చేస్తోన్నారు. అయితే బీజేపీ మాత్రం ఆయన వ్యవహారంపై వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. బయటకు ఆయన వ్యవహారంపై స్పందించకపోయినా.. తెరవెనుక మాత్రం రాజాసింగ్ కు న్యాయపరంగా సహాయం చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో కులాల మధ్య చిచ్చు పెట్టేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను రాజాసింగ్ ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

అియతే రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ఎత్తి వేయాలంటూ అభిమానులు, బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తోన్నారు. పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ రాజాసింగ్ కు బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని డెడ్ లైన్ విధించింది. ఇప్పటికే రాజాసింగ్ బీజేపీ షోకాజ్ నోటీసులకు సమాధానం ఇచ్చింది. కానీ రాజాసింగ్ సమాధానం తర్వత బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకులేదు. ఆయన వ్యవహారాన్ని పక్కన పెట్టేశారు. అయితే రాజాసింగ్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వల్ల హిందూవులు పార్టీకి దూరం అవుతారనే చర్చ కాషాయ వర్గాల్లో జరుగుతోంది. అందుకే ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.

ఈ క్రమంలో మునుగోడు ఉపఎన్నిక తర్వాత రాజాసింగ్ వ్యవహారంపై బీజేపీ నిర్ణయం తీసుకునే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఆయనపై విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు బీజేపీ సభలలో ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తోన్నారు. దీంతో బీజేపీ తప్పనిసరి పరిస్ధితుల్లో రాజాసింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేయాలని బీజేపీ కీలక నిర్ణయం తీసుున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మునుగోుడు ఉపఎన్నికల సమయంలో సస్పెన్షన్ ఎత్తివేస్తే ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశముందని, అందుకనే బీజేపీ సైలెంట్ గా ఉండదని చెబుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక ముగిసిన తర్వాత ఖచ్చితంగా ఆయనపై వేసిన సస్పెన్షన్ ఎత్తి వేస్తారని చెబుతున్నారు.

కాగా ప్రముఖ స్టాండప్ కమెడియన్ ఫారూకీ షోకు హైదరాబాద్ లో అనుమతి ఇవ్వడంపై రాజాసింగ్ ఫైర్ అయ్యారు. ఫారూఖీ షోను అడ్డుకునేందుకకు ప్రయత్నం చేశారు. ఫారూఖీ షో జరగనీవ్వకుండా అందోళనలు చేశారు. కానీ భారీ భద్రత మధ్య ఫారూఖీ షో జరిగింది. అనంతరం సోషల్ మీడియాలో రాజాసింగ్ విడదల చేసిన వీడియో దుమారం రేపింది. కులాలను మధ్య చిచ్చు పెట్టేలా ఆయన వీడియో ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేశరాు అరెస్ట్ చేశరాు. అయితే ఆ కేసులో ఆయన బెయిల్ పై బయటకొచ్చారు. కానీ గతంలో ఆయనపై నమోదైన రౌడీ షీట్ కేసును తెలంంగాణ పోలీసులు తెరపైకి తీసుకొచ్చారు. ఆయనపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో రాజాసింగ్ ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -