Black Day: నవంబర్ 27న క్రికెట్ చరిత్రలో నిలిచిన అత్యంత విషాదం అదే!

Black Day: ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉన్న గేంగా క్రికెట్ కు గుర్తింపు ఉంది. క్రికెట్ ను చాలా దేశాల్లో ఆట కన్నా ప్రాణంలా భావిస్తుంటారు. ఆ క్రికెట్ కోసం ఏం చేయాడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇలాంటి పిచ్చి అభిమానమే క్రికెట్ ను ఇప్పుడు పెద్ద హిట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఇప్పుడు ఈ క్రికెట్ అంటే ప్రాణం ఇచ్చేస్తుంటారు.

క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులు ఉండగా..ఎన్నో సంచలనాలకు క్రికెట్ అడ్డాగా నిలుస్తుండటం తెలిసిందే. అయితే క్రికెట్ చరిత్రలో నవంబర్ 27కు మాత్రం ఓ విషాద అధ్యాయం ఉంది. నవంబర్ 27 అంటే చాలు చాలామంది క్రికెటర్ల కళ్లు చమ్మగిల్లుతాయి. అప్పుడు జరిగిన విషాద ఘటనను గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు.

ఇంతకీ నవంబర్ 27న ఏం జరిగిందంటే?:

2014లో ఆస్ట్రేలియా ఫిలిప్ హ్యూస్ న్యూసౌత్ వేల్స్ బౌలర్ షాన్ అబాట్ వేసిన బౌన్సర్‌ హ్యూస్ తలకు నేరుగా తాకింది. ఆ తర్వాత హ్యూస్ తడబడుతూ నేలపై పడిపోయాడు. హ్యూస్ మూడు రోజులు కోమాలో ఉండి.. నవంబర్ 27న మరణించాడు. అప్పుడు ఫిలిప్ హ్యూస్ వయసు కేవలం 26 ఏళ్లు. హ్యూస్ మరణ వార్త క్రికెట్ ని అభిమానించే అందరినీ కంటతడి పెట్టించింది. ఎన్నోఆశలతో గ్రౌండ్ లోని అడుగుపెట్టిన హ్యూస్ ఇలా క్రికెట్ వల్లే ప్రాణాలు కోల్పోవడం ఎంతోమందిని కలచివేసింది.

నవంబర్ 27ను ఇప్పటికీ చాలామంది క్రికెట్ చరిత్రలో ఓ విషాదకరమైన రోజుగా భావిస్తారు. ఆ రోజు చాలామంది క్రికెటర్లు ఫిలిప్ హ్యూస్ మరణానికి సంతాపం ప్రకటిస్తూ ఉంటారు. కాగా 2021 మే 5న నెట్ ప్రాక్టీస్ సమయంలో 24 ఏళ్ల క్రికెటర్ జాషువా డౌనీ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. అలాగే భారత క్రికెట్ జట్టు ఆటగాడు రమణ్ లాంబా ఒక మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. బంతి అతని తలకు తగలడంతో మరణించాడు. ఇలా క్రికెట్ మైదానంలో క్రికెటర్ల మరణాలు క్రీడాభిమానులకు విషాదం మిగిల్చాయి.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -