Black Tea: ఆ సమస్యలు నుంచి రిలాక్స్‌ అవ్వాలంటే దీన్ని వాడాలి.. ఏంటో తెలుసా?

Black Tea: ఉదయం లేవగానే ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే మొదటి మాట టీ కావాలి. టీ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువ మంది ఉంటారు. పనిలో ఒత్తిడి, మనస్సు డల్‌గా ఉంటే ఓ కప్పు టీ తాగితే ఇప్పుడు వచ్చే ఆ ఉల్లాసమే వేరుంటున్నారు. టీ ప్రియులు. అయితే నీలోనే వివధ రకాలు ఉంటాయి. మనకు రెగ్యులర్‌ టీలు, కాఫీలు మాత్రమే ఎక్కువగా అలవాటు ఉంటాయి. ఈ రోజుల్లో డాక్టర్ల సలహాల వల్ల చాలా మంది గ్రీన్‌ టీ, తులసి ఆకుల టీ, లెమన్‌ టీ, ఆరెంజ్‌ టీ, గ్రీన్‌ కాఫీ, మాచా టీ వంటివి కూడా తాగుతున్నారు. ఐతే… వీటితోపాటూ… రెగ్యులర్‌గా బ్లాక్‌ టీ కూడా తాగితే ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బ్లాక్‌ టీలో ఉండే కొన్ని ప్రత్యేక గుణాలు ఇతర టీలలో ఉండవు అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

 

గాయాలైనప్పుడు..
గాయాల నుంచీ కాపాడేందుకు, రక్తం కారిపోవడాన్ని ఆపేందుకు, గాయాల మంట తగ్గేందుకు బ్లాక్‌ టీ ఉపయోగపడుతుంది. బ్లాక్‌ టీ తాగిన తర్వాత టీ బ్యాగ్‌ని పారేయకుండా గాయం దగ్గర దానితో టచ్‌ చేసే మంట తగ్గుతుంది.

నోటి చిగుళ్లకు..
చిగుళ్లు, దంతాల సమస్య ఉంటే తడి బ్లాక్‌ టీ బ్యాగ్‌ను నొప్పి ఉన్న చోట పెట్టి కాస్త నెమ్మదిగా నొక్కాలి. బ్లాక్‌ టీలోని టాన్నిక్‌ యాసిడ్స్‌ చిగుళ్లకు మేలు చేస్తాయి. బ్లాక్‌ టీని మౌత్‌ వాష్‌గా కూడా వాడొచ్చు.

వ్యాధినిరోధక శక్తి..
ప్రతి మీరు రోజూ ఉదయాన్నే 5 నిమిషాలపాటూ బ్లాక్‌ టీ తాగితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాల్ని కొన్ని రోజుల్లోనే గ్రహిస్తారు. మంచి నాణ్యమైన బ్లాక్‌ టీ బ్యాగులను వాడితే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. మీ శరీరంలో మంచి ఆరోగ్యకర మార్పులు చాలా వస్తాయి.

కళ్లకు రిలాక్స్‌..
కొంతమందికి మాటిమాటికీ కళ్లు మండుతూ దురద పెడతాయి. రెండు బ్లాక్‌ టీ బ్యాగులను పది నిమిషాలపాటూ గోరువెచ్చటి నీటిలో ఉంచాలి. ఇప్పుడు బ్యాగుల్లో అదనంగా ఉన్న నీటిని తొలగించాలి. ఇప్పుడు ఆ బ్యాగుల్ని కళ్లపై 10 నిమిషాలు పెట్టుకోవాలి. అంతే కళ్లు చల్లగా అయిపోతాయి.

అలెర్జీలకు..
కొంతమందికి సీజన్లు మారగానే అలెర్జీలు వస్తుంటాయి. అలాంటి వాళ్లు రోజుకు రెండు, మూడు బ్లాక్‌ టీలను తాగాలి. దాంతో అలెర్జీలకు చెక్‌ పెట్టినట్లవుతుంది.

డయేరియాకు చెక్‌..
పేగుల్లో వ్యర్థాలపై బ్లాక్‌ టీ యుద్ధం చేస్తుంది. ఫలితంగా పేగుల్లో మంట, నొప్పి వంటివి తగ్గుతాయి. ఇందుకోసం బ్లాక్‌ టీలో తేనె కలుపుకొని తాగితే, డయేరియా (విరేచనాలు) తగ్గుతుంది.

పైల్స్‌ సమస్యకు చెక్‌..
పైల్స్‌ సమస్య ఉన్నవారు గోరు వెచ్చటి, తడి బ్లాక్‌ టీ బ్యాగ్‌ని పైల్స్‌ నొప్పి ఉన్న ప్రాంతంలో ఉంచితే ఉపశమనం కలుగుతుంది. పైగా బ్లాక్‌ టీలోని టాన్నిక్‌ యాసిడ్‌ఎంతో మేలు చేస్తుంది. అంతేకాక బ్లీడింగ్‌ను సైతం ఆపుతుంది.

Related Articles

ట్రేండింగ్

Vizag Steel Plant: మూసివేత దిశగా విశాఖ ఉక్కు.. జగన్ సర్కార్ చేతకాని పాలనకు నిదర్శనం ఇదే!

Vizag Steel Plant:  విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆనుకొని ప్రభుత్వం నిర్మించిన గంగవరం పోర్టుని ఆదాని గ్రూప్ పూర్తిగా హస్తగతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వారం రోజులుగా ఈ పోర్టులో...
- Advertisement -
- Advertisement -