Black Water: కోహ్లీ తాగే నీళ్ల బాటిల్ ధర అంతా?! బ్లాక్ వాటర్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Black Water: ఇండియాలో క్రికెట్ కు ఉన్న పిచ్చి, ప్యాషన్ గురించి చెప్పక్కర్లేదు. క్రికెటర్లను సినిమా హీరోల కన్నా ఎక్కువగా అభిమానించే జనాలు మన దగ్గర ఉన్నారు. క్రికెటర్ల ఆటనే కాదు, వాళ్లకు సంబంధించిన ప్రతి అంశం మీద అభిమానులకు ఉత్సుకత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వారి లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుంటూ ఉంటారు.

ఇండియన్ క్రికెట్ చరిత్రలో రన్స్ మెషీన్ గా పేరున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఛేజింగ్ మాస్టర్ గా పేరున్న కోహ్లీ.. పూర్తి ఫిట్ గా కనిపిస్తూ ఉంటాడు. అయితే విరాట్ కోహ్లీ తన శరీరాన్ని ఫిట్ గా ఉంచడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మామూలు నీళ్లను కాకుండా బ్లాక్ వాటర్ ని తాగుతూ ఉంటాడు. అసలు ఈ బ్లాక్ వాటర్ ఏంటి? దాని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లాక్ వాటర్ ప్రత్యేకత ఏంటి?:

కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ లో సహజమైన ఆల్కలైన్ ఉంటుంది. ఇది శరీరాన్ని ఫిట్ గానూ, హైడ్రేటెగ్ గానూ ఉంచుతుంది. దీని వల్ల శరీరం వివిధ రోగాల నుండి పోరాడే శక్తిని పొందుతుంది. ఇందులో ఉండే 70శాతం ఖనిజాలు జీర్ణప్రక్రియను మెరుగుపరచడంతో పాటు రోగినిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. బ్లాక్ వాటర్లో యాంటీ ఏజెంట్‌ గుణాలు ఉంటాయి.

కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ ని రెగ్యులర్ గా తాగడం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుందట. ఈ బ్లాక్ వాటర్ తాగడం వల్ల చర్మ నాణ్యత మెరుగవడంతో పాటు బరువు కూడా అదుపులో ఉంటుందట. ఇంతకీ కోహ్లీ తాగే బ్లాక్ వాటర్ బాటిల్ ధర ఎంతంటే.. ఏకంగా రూ.3వేల నుండి రూ.4వేల వరకు ఉంటుంది. ఇండియాలో గుజరాత్‌లోని వడోదర లోని ఏవీ ఆర్గానిక్స్‌ అనే స్టార్టప్ ‘ఎవోకస్‌’ పేరుతో బ్లాక్‌వాటర్‌ ని అమ్ముతోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -