Jr NTR: ఆ డైరెక్టర్ కాళ్లు పట్టుకోలేక సినిమాను వదులుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే?

Jr NTR: “జూనియర్ ఎన్టీఆర్” ఇప్పుడు ఈ పేరు ఒక ప్రభంజనం. తను నటనతో ప్రపంచం మొత్తాన్ని తనువైపు తిప్పుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో నట విశ్వరూపం చూపించి టాలీవుడ్ కి ఆస్కార్ అవార్డు రావడానికి తనూ ఒక కారణమయ్యాడు ఎన్టీఆర్. అయితే ఎన్టీఆర్ కెరియర్ మొదలైనప్పటి నుంచి చూసుకుంటే ఆ జర్నీ అంతా ఆషామాషి అయిన జర్నీ కాదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎన్నో అపజయాలని ఎదుర్కొని..

పట్టుదలతో విజయాలు సాధించి ఇప్పుడు టాలీవుడ్ కి తిరుగులేని హీరో అయ్యాడు ఎన్టీఆర్ . ఇతను నటించిన సినిమాలలో అట్టర్ ప్లాప్ మూవీస్ ఉన్నాయి, అఖండ విజయాలు సాధించిన మూవీస్ ఉన్నాయి. అలాగే అతను వదులుకున్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి.అలా ఎన్టీఆర్ తిరస్కరణకి గురైన ఒక సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఊపిరి సినిమా గురించి అందరికీ తెలుసు కదా.. అది ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో, అందులో నటీనటులకు ఎంత మంచి పేరు తీసుకువచ్చిందో అందరికీ తెలిసిందే.

అయితే ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్న సమయంలో అల్లరి చిల్లరగా తిరిగే శీను పాత్రకి ముందుగా ఎన్టీఆర్ అయితే బాగుంటుంది అనుకున్నాడంట డైరెక్టర్ వంశీ పైడిపల్లి. అనుకున్నదే తడవుగా ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి వినిపించాడంట వంశీ. సినిమా కథ మొత్తం విన్న ఎన్టీఆర్ సినిమా కథ చాలా బాగుంది కానీ సినిమాలో యాక్ట్ చేయట్లేదు అంటూ సున్నితంగా తిరస్కరించాడంట.

అయితే దానికి కారణాలు పూర్తిగా తెలియదు కానీ ఈ సినిమాలో నాగార్జున ఒక పేషెంట్ పాత్రలో నటిస్తాడు. ఆ పేషెంట్ కి సేవ చేయటం కోసం శ్రీను అనే పాత్ర వస్తుంది. అయితే సీన్ డిమాండ్ మేరకు నాగార్జున కాళ్లు ఎన్టీఆర్ పట్టుకోవాల్సి వస్తుందని డైరెక్టర్ చెప్పారంట. అలా చేయటం ఇష్టం లేక ఈ పాత్రని వదులుకుంటున్నట్లు అప్పట్లో రూమర్లు వచ్చాయి.అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ. అదే పాత్రలో నటించిన తమిళ నటుడు కార్తీ ఆ పాత్రకి జీవం పోసాడు. సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయటంలో అతని నటన మరింత తోడైంది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -