Food Challenge: 5 నిమిషాల్లో 3 కిలోల నమోసా లాగించాడు..

Food Challenge: కొన్ని కొన్ని ఛాలెంజ్‌లు వింతగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. చెప్పిన సమయంలో పరుగుతో గమ్యానికి చేరుకోవడం.. క్షణల వ్యవధిలో గాలి బుడగలు ఊదడం, తక్కువ సమయంలో ఎక్కువ భోజనం చేయడం లాంటి ఛాలెంజ్‌లు చాలా ప్రాంతాల్లో జరుగుతుంటాయి. వారు చెప్పిన ఆహారాన్ని కేటాయించిన సమయంలో పూర్తి చేస్తే నగదు బహుమతులు ఇస్తుంటారు. ఇలాంటి ఛాలెంజ్‌లు దేశ రాజధాని ఢిల్లీలోని పరిసరా ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతుంటాయి. రోజుకొక కొత్త కొత్త ఛాలెంజ్‌లు విసరడం దాన్ని కొందరు స్వీకరించి పూర్తి చేయడం జరుగుతుంటాయి.

అయితే తాజాగా స్వీకరించిన ఛాలెంజ్‌ అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాజ్‌నీశ్‌ జ్ఞాని అనే వ్యక్తి ‘ఆర్‌ యూ హంగ్రీ’ అనే పేరుతో ఫేస్‌బుక్‌ పేజీ, యూట్యూబ్‌ ఛానల్‌ నడుపుతున్నాడు. ఆహార పోటీలకు వెళ్లటం.. అక్కడ ఇచ్చిన ఛాలెంజ్‌లను స్వీకరించి బహుమతులు, నగదు గెలుచుకోవడం పనిగా పెట్టుకున్నాడు. గత నెలలో 30 నిమిషాల్లోనే 21 ప్లేట్ల ‘చోలే కుల్తే’ తిని బులెట్‌ బైక్‌ గెలుచుకుని వైరల్‌గా మారి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే.. గెలుచుకున్న ఆబైక్‌ తిరిగి ఇచ్చేసి ఛాలెంజ్‌ను కొనసాగించాలని సూచించాడు. ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో 12 మిలియన్ల మంది చూశారు. ఇప్పుడు మరోమారు ఈ బ్లాగర్‌ వీడియో వైరల్‌గా మారింది. స్ట్రీట్‌ ఫుడ్‌ ఛాలెంజ్‌లో పాల్గొని కేవలం 5 నిమిషాల్లోనే 3 కిలోల సమోసా లాగించేశాడు.

ఢిల్లీలోని ఓ హోటల్‌లో జరిగిన ఈ సంఘటన వీడియో యూట్యూబ్‌లో షేర్‌ చేయగా 1 మిలియన్‌కుపైగా వ్యూస్‌ వచ్చాయి. వీడియోలో ఛాలెంజ్‌ను బ్లాగర్‌తో పాటు రెస్టారెంట్‌ ఓనర్‌ వివరించారు. ఆ తర్వాత బాహుబలి సమోసాను తింటున్న వీడియోను ప్లే చేశారు. అయితే, ఇలాంటి ఛాలెంజ్‌లు స్వీకరించేందుకు ముందు 1 లేదా 2 రెండు రోజులు ఏమీ తినకుండా ఉంటాడు. కొంచెం చట్నీ, నీళ్లతో స్నేహితుల ప్రోత్సాహంతో ఈ ఛాలెంజ్‌ను çఅనుకున్న సమయానికి పూర్తి చేసి రెస్టారెంట్‌ యజమాని నుంచి రూ.11వేల నగదు బహుమతి అందుకున్నాడు. ప్రస్తుతం 3 కిలోల సమోసా తింటున్న వీడియో బాగా వైరల్‌ అవుతొంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -