
క్కుసుమ్, వారిస్, సూర్యపుత్ర కర్ణ్, కసౌతి జిదంగీ కాయ్, క్రిష్ణ అర్జున్, క్యాదిల్ మైన్ హై వంటి షోలలో సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ నటించాడు. ఈ షోలతో బాగా పాపులర్ అయ్యాడు. తన నటనతో ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు. చివరిగా క్యోన్ రిష్తోన్ మైన్ కట్టి బట్టి, జిడ్డి దిల్ ప్రాజెక్టుల్లో నటించాడు.
సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ మృతి పట్ల పలువురు నటులు దిగ్బాంతి వ్యక్తం చేశారు. అతడి మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. అభిమానులు సోషల్ మీడియా ద్వారా సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తోన్నారు.
అయితే హీరోలు, నటుడు జిమ్ చేస్తోండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురై మరణించడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో పునీత్ రాజ్ కుమార్, సిద్దార్థ్ శుక్లా ఇలాగే మరణించారు. ఇప్పుడు సిద్దాంత్ వీర్ సూర్యవంశీ కూడా జిమ్ చేస్తూ గుండెపోటుకు గురై మరణించడం ఆందోళనకు గురి చేస్తోంది. ఎక్కువగా వర్కౌట్లు చేయడం, ఎలా పడితే అలా వర్కౌట్లు చేయడమే మరణాలకు కారణమనే చర్చ జరుగుతోంది. రెస్ట్ లేకుండా నిరంతరం వర్కౌట్లు చేయడం వల్లనే మరణాలు సంభవిస్తున్నాయని చెబుతున్నారు. ఇప్పుడు సిద్ధాంత్ మరణంతో మరోసారి వర్కౌట్లపై చర్చ మొదలైంది.
కాగా సిద్ధాంత్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. తొలుత ఇరాతో పెళ్లి జరగ్గా.. వీరికి ఒక పాప కూడా జన్మించింది. 2015లో ఇరాతో విడాకులు తీసుకుని.. ఆ తర్వాత 2017లో అలీసియాను పెళ్లి చేసుకున్నాడు. అలీసియా-సిద్దాంత్‌కు కూడా ఓ బాబు పుట్టాడు.