Bollywood: ఈ స్టార్ హీరోయిన్ యవ్వారాలు చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

Bollywood: సినీ తారల రియల్ లైఫ్ కి, రీల్ లైఫ్ కి చాలా తేడా ఉంటుందనే విషయం తెలిసిందే. వెండి తెర మీద రంగురంగులుగా సాగే చాలామంది తారల వ్యక్తిగత జీవితాలు చాలా భిన్నంగా ఉండవచ్చు. అయితే జనాల కోసం చాలామంది తారలు తమ వ్యక్తిగత జీవితాలను బయటకు రానివ్వకుండా చూసుకుంటారు. కానీ కొందరు మాత్రం ఎవరు ఏమనుకుంటే మాకేంటి అనుకుంటూ ఉంటారు. ఇలా ఎవరినీ పట్టించుకోని జాబితాకు చెందిన బాలీవుడ్ హీరోయిన్ మలైక అరోరా.

 

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి అయిన మలైక అరోరా.. 2017లో తన భర్త అర్బాజ్ ఖాన్ నుండి విడాకులు తీసుకుంది. అయితే వీరిద్దరు విడాకులు తీసుకున్నా కానీ మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. అదే సమయంలో మలైక అరోరా.. బాలీవుడ్ మరో హీరో అర్జున్ కపూర్ తో చాలా చనువుగా ఉంటుంది. లేట్ నైట్ కూడా వీరిద్దరు కలిసే కనిపిస్తూ ఉంటారు.

 

మలైక అరోరా, అర్జున్ కపూర్ లు రిలేషన్ లో ఉన్నారనే వార్త బాలీవుడ్ మొత్తం కోడై కూస్తున్నా.. వాళ్లు మాత్రం ప్రేమ పక్షుల్లాగా ఎంచక్కా తమ జీవితాలను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా మలైన తన మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో ఓ హోటల్ లో డిన్నర్ కి వెళ్లడం అందరినీ ఆశ్చర్య పరిచింది. విడాకులు తీసుకొని దూరంగా ఉంటున్న అర్బాజ్ ఖాన్ తో మలైన మళ్లీ కనిపించడం మీద నెటిజన్లు రకరకాలుగా స్పందింస్తున్నారు.

 

మలైక అరోరా శృతి మించి పనులు చేస్తోందని.. అందుకే భర్తతో విడిపోయి అర్జున్ కపూర్ తో రిలేషన్ లో ఉంటూ.. ఇప్పుడు తిరిగి తన భర్తతో కనెక్ట్ అవుతోందని మండిపడుతున్నారు. తనకు మూడ్ వస్తే ఇలా తన మాజీ మొగుడితో డిన్నర్ కు వెళుతుందంటూ ఘాటుగా కామెంట్లు చేస్తున్నారు. లేటు వయసులో కూడా అమ్మడు ఓ పక్కన మాజీ భర్తను మరో పక్క తన ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -