Bombay Padma: టాలీవుడ్ ప్రేక్షకులకు దాసరి నారాయణరావు అనే పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇతడు దాదాపు 150 సినిమాలకు పైగా దర్శకత్వం వహించి తెలుగు నాట దర్శకుడుగా తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నాడు. అంతేకాకుండా ఎక్కువ సినిమాలను దర్శకత్వం వహించిన దర్శకుడుగా గిన్నిస్ రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. ఇక తానే 53 సినిమాలు సొంతంగా నిర్మించుకున్నాడు.
అలా తెలుగు ఇండస్ట్రీలో దాసరి నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగాడు. ఇక దాసరి నారాయణ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయంగా కూడా కొంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. రాజీవ్ గాంధీ పాలన నడుస్తున్నప్పుడు. దాసరి నారాయణ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు కూడా ఎన్నికయ్యాడు.
ఇదిలా ఉంటే సినీనటి బొంబాయ్ పద్మ గురించి మనందరికీ తెలిసిందే. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె దాసరి నారాయణ గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు బయటపెట్టింది. ఆ ఇంటర్వ్యూలో పద్మ మాట్లాడుతూ మా సొంత అక్క భర్త అయినటువంటి మా బావ గారి స్నేహితుడు దాసరి నారాయణ రావు గారు అని తెలిపింది. ఇక వారి స్నేహం ఎలా ఉండేదంటే మా మామయ్య గారి జేబులో డబ్బులు తీసి సిగరెట్లు తాగేవారు అని చెప్పుకు వచ్చింది పద్మ.
ప్రస్తుతం పద్మ చెప్పిన మాటలు యూట్యూబ్లో తెగ హడావిడి చేస్తున్నాయి. ఇక దాసరి నారాయణరావు గారి వ్యక్తిగత జీవితానికి వస్తే అతడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు లో జన్మించాడు. దాసరి కుటుంబం చాలా సాధారణమైనది. దాసరి వాళ్ళ నాన్న పెదనాన్న కలిసి పొగాకు వ్యాపారం బాగా చేసేవారట. ఒకసారి వీళ్ళ పొగాకు గోడౌన్ కూడా తగలబడిందట. అప్పట్లో ఇన్సూరెన్స్ లాంటివి ఉండేవి కాదు కాబట్టి వీరి కుటుంబం ఆ విషయంలో ఎలాంటి ఇన్సూరెన్స్ పొందలేదట.