Electric Scooter: గత కొద్ది కాలంగా ఎలక్ట్రిక్ స్కూటీల ట్రెండ్ నడుస్తోంది. బ్యాటరీలు పేలిపోయిన ఘటనలు కానీ, తక్కువ ధరకే ఎక్కువ లాభం పొందేలా తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటీలుగానీ.. అంశం ఏదైనా ఇవి ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా గడచిన వేసవి కాలం ముందు వీటిని విపరీతంగా మార్కెట్లోకి విడుదల చేశారు. కొనుగోలు కూడా అదే స్థాయిలో జరిగాయి.
ప్రముఖ బుకింగ్ యాప్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటీల బిజినెస్ లోకి ఎంటరయ్యాక ఈ రంగం పీక్ స్టేజ్ లోకి చేరింది. కొనుగోలుదారులు భారీగా బుకింగ్ చేసుకోవడం మొదలుపెట్టారు. తాజాగా దీపావళి సందర్భంగా సరికొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది ఓలా. ఓలా ఎస్1 ఎయిర్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లోకి వచ్చింది. దీని ధర మార్కెట్లో రూ.80 వేల వరకు ఉంది. ఓసారి ఛార్జింగ్ చేస్తే 100 కిలోమీటర్ల దాకా ప్రయాణం చేసేయొచ్చు.
బుకింగ్ ధర కేవలం రూ.999
ఓలా విడుదల చేసిన ఈ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటీ బుకింగ్ ధర కేవలం రూ.999. దీపావళి సందర్భంగా దీన్ని బుక్ చేసుకుంటే అదనపు డిస్కౌంట్ రూ.5 వేల వరకు మీకు కలిసొస్తుంది. అయితే, దీపావళి దాటిన తర్వాత దీని ధర రూ.84,999కి పెంచుతున్నారు. ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ తో పోలిస్తే రూ.20 వేల తక్కువగా, ఎస్1 ప్రో స్కూటర్ తో పోలిస్తే రూ.50 వేలు తక్కువగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది.
ఇప్పుడు బుక్ చేసుకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఓనర్ కు వాహనాన్ని చేరుస్తుంది ఓలా. ఇది రెండు రంగుల్లో అందుబాటులో ఉంటుంది. 7 ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే ఉంటుంది. దీని బరువు 99 కేజీలు. సింగిల్ చార్జ్ లో ఎకో విధానం ద్వారా వంద కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. దీని గరిష్ట స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. 4 సెకన్లలో 40 కిలోమీటర్ల వేగం అందుకోగల సామర్థ్యం ఉంది.