Boyapati: మోక్షజ్ఞ బోయపాటి కాంబో మూవీ ఇలా ఉంటుందా?

Boyapati: టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి కొన్నేళ్లుగా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకే అవి కార్యరూపం దాల్చలేదు. తాజాగా మరోసారి అతడి అరంగేట్రం గురించి వార్తలు షికారు చేస్తున్నాయి. ఇటీవల మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలను బాలయ్య ఘనంగా నిర్వహించాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్‌తో తన కుమారుడి పుట్టినరోజును బాలయ్య జరిపాడు. ఈ సందర్భంగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

 

పుట్టినరోజు ఫోటోల్లో మోక్షజ్ఞ లుక్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గతంతో పోలిస్తే అతడు హ్యాండ్‌సమ్‌గా కనిపిస్తున్నాడు. దీంతో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఫిక్స్ అయిపోయిందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. స్వయంగా బాలయ్య ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయడంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నందమూరి వంశం నుంచి మరో హీరో వచ్చేస్తున్నాడంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

 

ప్రస్తుతం నందమూరి వంశం నుంచి బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ మాత్రమే క్రేజ్ ఉన్న హీరోలుగా ముందుకు దూసుకుపోతున్నారు. మధ్యలో తారకరత్న, నారా రోహిత్ వంటి హీరోలు కొన్ని సినిమాల్లో నటించిన ఇటీవల వాళ్లు సినిమాలు చేయడం తగ్గించారు. ఇప్పుడు యువ హీరో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని తెలియడంతో నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య వెల్లడించాడు.

మోక్షజ్ఞ తొలి సినిమా బోయపాటితోనేనా?

టాలీవుడ్‌లో దర్శకుడు బోయపాటి మాస్ సినిమాలు తీయడంలో ఘనాపాటి. ఆయన దర్శకత్వంలో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇదే విషయంపై బాలయ్య స్పందిస్తూ.. అదంతా దైవ నిర్ణయం అని.. ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. కానీ మోక్షజ్ఞ ఎంట్రీ ఆదిత్య 369 సీక్వెల్‌తోనే ఉంటుందని కొందరు అభిమానులు భావిస్తున్నారు. తనయుడు హీరోగా నటించనున్న ఈ మూవీలో బాలయ్య విలన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంతో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు నందమూరి ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -