Brahmastra: భారీ నష్టాలను ఎదుర్కొన్న బ్రహ్మాస్త్ర.. ఎన్ని కోట్లు తెలుసా?

Brahmastra: బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా సెప్టెంబర్ 9వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ఘనంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇకపోతే ఈ సినిమా విడుదల సమయంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ భారీ స్థాయిలో హడావిడి చేశారు.

ఈ సినిమా విడుదలైన అనంతరం పలుచోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ కొన్ని భాషలలో బ్రేక్ ఈవెన్ కూడా సాధించలేక పోయిందని తెలుస్తోంది. ఇక తెలుగులో ఈ సినిమాని రాజమౌళి సమర్పణలో విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.అయితే రాజమౌళి ఈ సినిమా బాధ్యతలను తీసుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈ సినిమా తెలుగులో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి తెలుగు భాషలో మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించింది.

ఇక ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమా కలెక్షన్లను చూస్తే ఈ సినిమా భారీ నష్టాలను ఎదుర్కొందని తెలుస్తుంది.బ్ర‌హ్మాస్త్ర ఫుల్ ర‌న్ లో వ‌ర‌ల్డ్ వైడ్ రూ.400 కోట్ల గ్రాస్, రూ190 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఈ సినిమా బిజినెస్ 600 కోట్లు జరుపుకోగా గ్రాస్ వసూలు మాత్రం 300 కోట్లు వచ్చాయి. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 300 కోట్లు రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమా 65 శాతం రికవరీ సాధించింది అంటే 35 శాతం నష్టాలను ఎదుర్కొంది అనగా ఈ సినిమా సుమారు 100 కోట్లకు పైగా నష్టాలను ఎదుర్కొన్నట్లు ఈ సినిమా కలెక్షన్లు చెబుతున్నాయి.ఇక తెలుగులో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినప్పటికీ నార్త్ ఇండస్ట్రీలో మాత్రం ఎక్కడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. పార్ట్ 1 ఇలాగ ఉంటే పార్ట్ 2పరిస్థితి ఏంటో అని పలువురు ఈ సినిమాపై వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -