Brazil: గర్భిణిని పొడిచి చంపారు.. కడుపుకోసి బిడ్డను ఎత్తుకెళ్లారు.. కారణం అదే!

Brazil: డబ్బుల కోసం కొందరు ప్రవర్తిస్తున్న తీరు హద్దులు మీరిపోతోంది. ఈజీగా డబ్బులు వస్తున్నాయంటే వారు ఎంతకైనా తెగిస్తున్నారు. డబ్బుకోసం ప్రాణాలు సైతం తీసేందుకు వెనకాడటం లేదు. నవజాత శిశువు మొదలుకొని వృద్ధులను సైతం చంపేస్తున్నారు.బ్రెజిల్‌లో జరిగిన ఘటనను చూస్తే కన్నీళ్లు ఆగవు. కొందరు గుర్తు తెలియని దుండగులు ఓ నిండు గర్భిణిని అతి దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా ఆ గర్భిణి పొట్టకోసి లోపల ఉన్న శిశువును ఎత్తుకెళ్లారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పావో పాలోలోని పోర్టల్‌ డాస్‌ లాగోస్‌లో ఒహానే కరోలిన్‌ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముంటుంది. అయితే.. భర్త నుంచి విడిపోయిన కరోలిన్‌ గత కొంత కాలంగా తన ప్రియుడితో కలిసి జీవిస్తోంది. ఈ క్రమంలో నిండు గర్భవతి అయిన కరోలిన్‌ సెప్టెంబర్‌ 21న పోర్టల్‌ డాన్‌ లాగోస్‌లో కారులో కూర్చుని ఉంది. ఆమె ఒక్కతే కారులో కూర్చుని ఉండం గుర్తించిన కొందరు దుండగులు గుట్టుచప్పుడు కాకుండా ఆమె కారు వద్దకు వచ్చారు. మాట్లాడుతున్నట్లు నటిస్తూ వారి వద్దనున్న పదునైన కత్తులతో వ విచక్షణరహితంగా పొడిచి చంపారు.

ఆ తర్వాత అంతటి ఆగకుండా ఆమె కడుపును కోసి లోపల ఉన్న నవజాత శిశును బయటకు తీసి ఎత్తుకెళ్లిపోయారు. కాసేపటి తర్వాత గమనించిన స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ మహిళ డెడ్‌బాడీని పోస్ట్‌ మార్టం నిమిత్తం సమీపంలోని ఓ ఆస్పత్రికి తరులించారు. అయితే పోలీసుల ప్రాథమిక విచారణలో దుండగులు ఆమె కడుపులో ఉన్న బిడ్డను బలి ఇవ్వడానికి ఆమె కడుపు కోసి తీసుకెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అయితే సదరు మహిళను హత్య చేసి శిశువును ఎత్తుకెళ్లిన ఘటనలో ఎవరెవరి పాత్ర ఉందో అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -