Brett Lee: అతడు జిమ్‌కు వెళ్తే భారత జట్టుకు భారీ నష్టం!.. స్టార్ పేసర్ పై బ్రెట్ లీ కామెంట్స్..!

Brett Lee: ఒకప్పుడు ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్ లాంటి పేసర్లు టీమిండియాలో ఉండేవారు. ఆ తర్వాత బాలాజీ, ఇర్ఫాన్ పఠాన్, శ్రీశాంత్, ఆర్పీ సింగ్ వంటి వాళ్లు భారత బౌలింగ్ దళానికి వెన్నెముకలా నిలిచారు. అయితే ఆ తర్వాత మాత్రం మన టీమ్ పేస్ అటాక్ లో పదును తగ్గుతూ వచ్చింది.

ఇకపోతే, ఆసియా కప్, వరల్డ్ కప్ లాంటి మేజర్ ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఓడిపోవటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీ20ల్లో నంబర్ వన్ ర్యాంకులో ఉన్న జట్టు ఇలా కీలకమైన టోర్నీల్లో చేతులెత్తేయడాన్ని వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. బ్యాటింగ్ పరంగా బాగున్నప్పటికీ మన జట్టు బౌలింగ్ లో అంత పస కనిపించడం లేదు. ఆసియా కప్ నుంచి భారత జట్టును బౌలింగ్ సమస్య వేధిస్తోంది.
దొరికిన ఆణిముత్యం..!
లీగ్ మ్యాచుల్లో రాణించినప్పటికీ నాకౌట్ మ్యాచులకు వచ్చేసరికి మన బౌలర్లు తేలిపోతున్నారు. జట్టు ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ కు దూరం కావడంతో.. మన జట్టు భారీ మూల్యం దక్కించుకుంది. ఈ మెగా టోర్నీలో సెమీస్ లోనే భారత్ ఇంటిదారి పట్టింది. బుమ్రా దూరమవ్వడం, సీనియర్ బౌలర్ భువనేశ్వర్ ఫామ్ లేమితో సతమతమవుతున్న సమయంలో అర్ష్‌దీప్ సింగ్ రూపంలో టీమిండియాకు ఆణిముత్యం దొరికాడు.
వాటిని అస్సలు పట్టించుకోవద్దు: బ్రెట్ లీ
ఒకవేళ అర్ష్‌దీప్ జిమ్ కు వెళ్లినా.. ఎక్కువగా బరువులు ఎత్తొద్దని బ్రెట్ లీ సూచించాడు. జిమ్ లో కసరత్తులు చేసి కండలు పెంచితే బౌలింగ్ వేగం పెరగదని.. దీంతో పాటు ఎక్కువ కాలంపాటు కెరీర్ కొనసాగదని బ్రెట్ లీ హెచ్చరించాడు. ప్రస్తుతం అర్ష్‌దీప్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడని.. దానిని అతడు అలాగే కొనసాగించాలని సూచించాడు. అర్ష్‌దీప్ జిమ్ కు వెళ్తే టీమిండియాకు భారీ నష్టం కలుగుతుందని వార్నింగ్ ఇచ్చాడు. సాధ్యమైనంత ఎక్కువగా సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటూ బ్రెట్ లీ అర్ష్‌దీప్ కు సలహా ఇచ్చాడు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను అస్సలు పట్టించుకోవద్దని.. గతంలో అర్ష్‌దీప్ సింగ్ పై వచ్చిన ట్రోల్స్ ను గుర్తుచేస్తూ బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -