BRS: కేసీఆర్ జాతీయ రాజకీయాలకు ఆదిలోనే చిక్కులు.. షాక్ ఇచ్చిన ఆ రెండు రాష్ట్రాల సీఎంలు

BRS: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ దసరా పండుగ రోజు టీఆర్ఎస్ పార్టీ నేతల సమక్షంలో సీఎం కేసీఆర్ తీర్మానం చేశారు. అనంతరం టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చిన తీర్మానాన్ని ఈసీకి అందించారు. కానీ బీఆర్ఎస్ పేరుతో ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడంపై ఈసీ పరిశీలన చేపడుతోంది. బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా బలంగా పునాదులు వేసేందుకు కేసీఆర్ రూట్ మ్యాచ్ సిద్దం చేసుకున్నారు. కానీ మధ్యలో మునుగోడు ఉపఎన్నిక రావడంతో కేసీఆర్ ప్రయత్నాలకు కాస్త బ్రేక్ పడింది.

 

బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి మునుగోడు ఉపఎన్నికలను ఎదుర్కొనుండటంతో.. ఈ ఉపఎన్నిక టీఆర్ఎస్ కు కీలకంగా మారింది. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మునుగోడు ఉపఎన్నికల్లో ఒకవేళ టీఆర్ఎస్ ఓడిపోతే కేసీఆర్ పై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యే అవకాశముంది. తెలంగాణలోని ఉపఎన్నికల్లో గెలవలేని కేసీఆర్.. జాతీయ పార్టీ పెట్టి ఇతర రాష్ట్రాల్లో కూడా పోటీ చేసి ఏం చేస్తారని ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మునుగోడు ఉపఎన్నికల్లో ఎాలాగైనా గెలిచేందుకు సీఎం కేసీఆర్ విశ్వ ప్రయత్నాలు చేశారు.

 

అయితే మునుగోడు ఉపఎన్నిక ముగిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ మరింత దూకుడు పెంచే అకకాశముంది. ఇతర రాష్ట్రాల్లో కూడా కేసీఆర్ పోటీ చేసేందుకు ఇప్పటినుంచే కసరత్తులు మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో బహిరంగ సభ నిర్వహించేందుకు కేసీఆర్ సిద్దమవుతున్నాయి. కానీ బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్ కు ఇతర రాష్ట్రాల సీఎంలు షాక్ లు ఇస్తోన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు తీసుకునే నిర్ణయాలు తెలంగాణలో కేసీఆర్ కు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ జర్నలిస్టులు తీపికబురు అందించారు. సర్వీస్ నుంచి పదవీవిరమణ పొందిన జర్నలిస్టులు ప్రతి నెల రూ.10 వేలు పెన్షన్ మంజూరు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇన్పర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డైరెక్టరేట్ నుంచి పదవీ విరమణ పొందిన రైతులకు పెన్షన్ ఇవ్వనున్నారు.

 

అయితే తమిళనాడు ప్రభుత్వ తరహాలో తెలంగాణలో కూడా పదవీ విరమణ పొందిన జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తోన్నాయి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తానంటూ హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇప్పుటివరకు ఎలాంటి ఇళ్ల జర్నలిస్టులకు ఇవ్వలేదు. దీంతో ఇప్పుడు జర్నలిస్టుల నుంచి కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఇళ్ల స్థలాలను పాటు పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిర్ణయం కూడా కేసీఆర్ కు చిక్కులు తెచ్చి పెడుతోంది. కాంట్రాక్టు ఉద్యోగాల పద్దతిని రద్దు చేసిన నవీన్ పట్నాయక్.. ఒడిశా ప్రభుత్వంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ ఉద్యోగులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

 

దాదాపు 40 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించారు. అయితే తెలంగాణలో కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ చేపడతామని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తామంటూ అసెంబ్లీలో హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఎలాంటి ఉత్తర్వులు ఇప్పటివరకు జారీ చేయలేదు. ఇప్పుడు నవీన్ పట్నాయక్ నిర్ణయంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలంగాణలో ఆందోళన చేపడుతున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ పై కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తమిళనాడు, ఒడిశా ప్రభుత్వ నిర్ణయాలు కేసీఆర్ చిక్కులు తెచ్చి పెట్టాయి. బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని భావిస్తున్న కేసీఆర్ కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -