Btech Ravi: జగన్ పై బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు.. ఏం జరిగిందంటే?

Btech Ravi: ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వైఎస్ వివేకానంద రెడ్డి. మొన్నటి వరకు అవినాష్ రెడ్డి పేరు కూడా సోషల్ మీడియాలో మారుమోగగా ఇప్పుడు టీడీపీ నేత బీటెక్ రవి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. కాగా వివేకా హత్య కేసులో బీటెక్ రవి పేరు కూడా వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ సిబిఐ అతనిని అభియోగాల నుండి తొలగించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం బీటెక్ రవి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వైసీపీ ప్రభుత్వం గురించి చేస్తున్న వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బీటెక్ రవి ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ.. పులివెందుల మెడికల్ కాలేజీకి వివేకా పేరు పెట్టాలని సీఎం జగన్ ముందుకొచ్చారు. ఆయన పేరు చరిత్ర పుస్తకాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కళాశాల కోసం కుటుంబానికి చెందిన 80 – 100 ఎకరాల భూమిని విరాళంగా ఇవ్వాలని కోరారు. భూమి విలువ ఎకరం 20 లక్షలు మాత్రమే. మీకు ఎకరాకు కోటి అందేలా చూస్తాను. మీరు భూమి కోసం 100 కోట్లు పొందుతారు అంటూ బీటెక్ రవి తెలిపారు.

 

కానీ తన తండ్రికి న్యాయం చేయాలనే కోరికతో సునీత అంగీకరించలేదనీ, తాము ఈ నేరం చేయలేదని చెప్పవచ్చు కానీ, పోరాడుతున్న సునీతపై ఆరోపణలు చేయడం చాలా అమానవీయమని అన్నారు రవి. ఇంటర్వ్యూలో భాగంగా బీటెక్ రవి చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే వివేక హత్యకేసు విషయానికి వస్తే.. ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత స్థానంలో అవినాష్ రెడ్డి ఉంటారు అంటూ ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే అవినాష్ రెడ్డిని కొన్ని గంటల పాటు సిబిఐ విచారించిన విషయం తెలిసిందే. మొత్తంగా చూసుకుంటే ఇప్పట్లోవివేక హత్య కేసు ముగిసేలా కనిపించడం లేదు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -