Bubli Bouncer Movie Review: బబ్లీ బౌన్సర్ సినిమా రివ్యూ & రేటింగ్

విడుదల తేది: సెప్టెంబర్ 23
నటీనటులు: తమన్నా, అభిషేక్ బజాజ్, సౌరభ్ శుక్ల, సాహిల్ వైడ్ తదితరులు
నిర్మాణ సంస్థ: స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్
నిర్మాత: వినీత్ జైన్, అమృత పాండే
దర్శకత్వం: మధుర భండార్కర్
సంగీతం: తనిష్క్ బగ్చి, కరణ్ మల్హోత్రా
సినిమాటోగ్రఫీ: హిమ్మన్ ధమిజా
ఎడిటర్: మనీష్ ప్రధాన్

Bubli Bouncer Movie Review and Rating

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా వరుస సినిమాలతో బాగా దూసుకుపోతుంది. ఇక ప్రస్తుతం తను బబ్లీ బౌన్సర్ సినిమాలో నటించగా ఈ సినిమా తనకు ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.

కథ: ఇందులో తమన్నా బబ్లీ పాత్రలో కనిపించింది. ఆమె ఢిల్లీకి సమీపం లోని ఫతేపూర్ లో నివసిస్తుంది. ఆ ఊర్లో అబ్బాయిలందరూ ఢిల్లీకి వెళ్లి బౌన్సర్లుగా పని చేస్తుంటారు. వాళ్ళల్లో కుకు అనే అబ్బాయి (సాహిల్ వైడ్) బబ్లీని చూసి ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులతో బబ్లీ ఇంటికి పెళ్లి సంబంధం తీసుకొని వెళ్తాడు. ఇంతకు ముందు బబ్లీ పెళ్లి ఇష్టంలేక రెండు మూడు సంబంధాలు చెడగొట్టి ఉంటుంది. కానీ కుకు తనను ప్రేమిస్తుండడంతో కుకు కి ఒక కండిషన్ పెట్టి పెళ్లికి ఓకే చెబుతుంది. ఆ కండిషన్ ఏంటంటే ఒక ఏడాది పాటు ఢిల్లీలో ఉద్యోగం చేస్తానంటుంది. కుకు దానికి అంగీకరిస్తాడు. ఇక కుకు పని చేసే నైట్ క్లబ్‌లో బబ్లీకి లేడీ బౌన్సర్ ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నదే మిగతా కథ.

నటీనటుల పనితీరు: తమన్నా భాటియా బబ్లీ పాత్రలో అద్భుతంగా నటించింది. సినిమాలోని కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో, కొన్ని ఇతర సన్నివేశాల్లో ఆమె తన నటనను అద్భుతంగా ప్రదర్శించింది. తన పాత్రకు ఆమె వాడిన యాస కూడా పర్ఫెక్ట్ గా కనిపిస్తోంది. సౌరభ్ శుక్లా పాత్రలో సహజంగా కనిపిస్తాడు. షాహిల్ వైద్ కుక్కోగా మంచి నటన కనబరిచి నవ్వులు పూయించాడు. మన్నుగా కరణ్ సింగ్ కొన్ని సన్నివేశాలతో పర్వాలేదు, కానీ నటుడిగా ఇంకా చాలా మెరుగుపడాలి. మిగతా నటీనటులందరూ కథకు అవసరమైన విధంగా తమ వంతు పాత్రను చక్కగా చేశారు.

విశ్లేషణ: కథలో కొత్తదనం ఏమీ లేదు. అంతా రొటీన్ కథ. హీరోయిన్ బౌన్సర్ అనేది రొటీన్. బౌన్సర్ కాకుండా హోటల్‌లో వెయిటర్‌గా తమన్నా పాత్రను చూపించినా కథ బాగుండేది.

ఇందులో కామెడీ సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోలేదు. తమన్నా వన్ మ్యాన్ షో కూడా ‘బబ్లీ బౌన్సర్’ను లిఫ్ట్ చేయలేకపోయింది.

ఇది మధుర్ భండార్కర్ నుంచి ఆశించే సినిమాలా కనిపించలేదు. సినిమా అయ్యాక… ‘లేడీ బౌన్సర్స్ కథ ఎక్కడుంది?’ అని ఆలోచన వస్తుంది. డైరెక్టర్ ఈ కథ ద్వారా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి.

ప్లస్ పాయింట్స్: సినిమాటోగ్రఫీ, నటీనటుల ప్రదర్శన

మైనస్ పాయింట్స్: కామెడీ సన్నివేశాలు, కథ, కథనం

రేటింగ్: 2.5/5

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: ఆస్తుల కోసం షర్మిల కోర్టుకు వెళ్తుందా.. తండ్రి ఆస్తులను జగన్ ఇచ్చే ఛాన్స్ లేదా?

YS Sharmila: వైయస్ జగన్మోహన్ రెడ్డి పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ గత కొంతకాలంగా తన సోదరి వైఎస్ షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే వీరిద్దరి మధ్య ఎందుకు...
- Advertisement -
- Advertisement -