Pushpa-KGF2: ఈ స్టార్స్ సినిమాలకు బడ్జెటే కీలకం.. ఎందుకంటరా?

Pushpa-KGF2: పుష్ప-2, కేజీఎఫ్-2 సినిమాకు మధ్య తేడా ఏంటనే విషయంలో సక్సెస్ కంటే బడ్జెటే కీలకమని చెప్పుకోవచ్చు. పుష్ప మొదటి భాగం, కేజీఎఫ్ రెండు సినిమా పాన్ ఇండియా లెవల్‌లో ఇండస్ట్రీయల్ హిట్ అందుకున్నాయి. అంత పెద్ద సక్సెస్ అందుకున్నఈ సినిమాలకు ఎంత బడ్జెట్ అయిందనే విషయం కీలకంగా మారనుంది. సాధారణంగా ఒక సినిమా తీయాలంటే బడ్జెట్ 100 రూపాయలు పెట్టుబడి పెట్టి.. 150 సంపాదించడం. లేదా 50 రూపాయలు పెట్టుబడి పెట్టి 150 రూపాయలు సంపాదించడం. ఈ రెండు పాయింట్లలో లాభం ఉన్నప్పటికీ బడ్జెట్‌లో తేడా ఉంది. అలా అని సినిమా క్వాలిటీలోనూ ఏమైనా తేడా ఉందంటే అది కూడా లేదు. ఎందుకంటే కేజీఎఫ్-2లో ఎక్కువ శాతం కొత్తగా పని నేర్చుకున్న వాళ్లు, నూతన నటులు నటించారు.

అయితే ప్రస్తుతం ఈ ప్రస్తావన ముందుకు రావడానికి ఒక కారణం ఉంది. పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం నిర్మాతలు ఎంత బడ్జెట్ కేటాయించారు. లాభం ఎంత వచ్చిందనేదే ప్రశ్న. ఎందుకంటే ఈ సినిమా రేంజ్ తెలియకముందే హక్కులన్నీ తక్కువ రేట్లకు అమ్మేసుకున్నారు మేకర్స్. దీంతో లాభం తక్కువలో ముగించారు. దీంతో ప్రస్తుతం పుష్ప-2 విషయంలో భారీ అంకెలు రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే పుష్ప-2 ఆదాయం ఎంత ఉంటుందో.. ఖర్చు కూడా అంతే ఉండబోతుందని సమాచారం.

పుష్ప-2 సినిమా కోసం చిత్ర బృందం లోకేషన్ల వెతుకులాట ప్రారంభించింది. అలాగే అల్లు అర్జున్ ఫోటో షూట్ కోసం బాలీవుడ్ నుంచి ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్‌ను రప్పించారు. దీంతో ఖర్చు ఏ రేంజ్‌లో ఉంటుందనే విషయం మైత్రీ నిర్మాణ సంస్థకే తెలుసు. అలాగే ఇక్కడున్న డిజైనర్లు సరిపోరన్నట్లు బాలీవుడ్ నుంచి పోస్టర్ డిజైనర్లను రప్పించుకుంటున్నారు. బేసిక్ వర్క్ నుంచే ఆల్ ఓవర్ ఇండియాలో పనిచేసే టెక్నీషియన్లును ఈ సినిమాలో ఇన్వాల్ చేస్తున్నారు. దీంతో ఈ సినిమా బడ్జెట్ కూడా భారీ స్థాయిలో ఉండబోతుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnamraju: రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా.. ఏ దిక్కు లేకపోతే అ పార్టీనే దిక్కవుతుందా?

Raghurama Krishnamraju: ఏపీలో రఘురామకృష్ణం రాజు ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నారు. నిజానికి గత నాలుగేళ్లు ఏపీ రాజకీయాల్లో ఆయన ట్రెండ్ అవుతూనే ఉన్నారు. వైసీపీ ఎంపీల పేర్లు గుర్తు...
- Advertisement -
- Advertisement -