Budi Mutyala Naidu: వైసీపీ ఎంపీ అభ్యర్థికి “సన్” స్ట్రోక్.. తండ్రి ఓటమి కోసం కొడుకు ప్రచారం చేస్తున్నారా?

Budi Mutyala Naidu:  రాష్ట్ర ఎన్నికలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయాల ముందు కుటుంబ బంధాలు ఓడిపోతున్నాయి. ఇంతకుముందు టెక్కలి లో ఇలాంటి ఘటన ఒకటి చూసాము, ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం లో అలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మా నాన్నని ఓడించండి అంటూ ఓ కొడుకు బహిరంగ ప్లకార్డులతో ప్రచారాన్ని మమ్మురం చేస్తున్నారు.

డిప్యూటీ సీఎం అనకాపల్లి పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాల నాయుడు కుమారుడు బూడి రవికుమార్ తన తండ్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉండటం ఇప్పుడు అనకాపల్లి నియోజకవర్గ రాజకీయాలలో ప్రాధాన్యత సంతరించుకుంది. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన రెండో భార్య కుమార్తె అనురాధ పోటీ చేస్తున్నారు.

దీంతో బూడి ముత్యాల నాయుడు మొదటి భార్య కుమారుడు రవికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచారు. ఈ మేరకు రవికుమార్ తన తండ్రిపై సామాజిక మాధ్యమాలలో విన్నూర్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. కన్న కొడుకుకి న్యాయం చేయలేని వాడు ఓటేసిన ప్రజలకు ఏమి న్యాయం చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రజలందరూ ఆలోచించి ఓటు వేయండి మా నాన్న బూడి ముత్యాల నాయుడు ని ఓడించండి అని విజ్ఞప్తి చేస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో ఈ విజ్ఞప్తి వైరల్ అవుతున్నప్పటికీ వైసీపీ నేతలకి తలనొప్పిగా మారింది ఈ సంఘటన.

స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన రవికుమార్ తన తాత ప్రజల ఆశీస్సులతో తప్పకుండా స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధిస్తానని ధీమాని వ్యక్తం చేశారు. అంతేకాదు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు క్యాంప్ కార్యాలయాన్ని రాజకీయంగా వినియోగించుకుంటున్నారని ఇటీవల ఆయన కుమారుడు బూడి రవికుమార్ పిర్యాదు చేశారు. దీంతో అధికారులు స్పందించి క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయించారు. కన్న కొడుకే తండ్రిపై ఇలా వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో వైసీపీ శ్రేణులలో గందరగోళం నెలకొంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -