Bunny-NTR: మరో భారీ మల్టీస్టారర్ దిశగా అడుగులు.. దర్శకుడు అతనేనా?

Bunny-NTR: ఈ మధ్యకాలంలో మల్టీస్టారర్ సినిమాలు విపరీతమైన క్రేజ్‌ను దక్కించుకుంటున్నాయి. ఈ ఏడాది రిలీజ్ అయిన చాలా వరకు మల్టీస్టారర్ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాయి. ఈ ఏడాది అక్కినేని నాగార్జున-నాగ చైతన్య కాంబినేషన్‌లో వచ్చిన ‘బంగార్రాజు’ సినిమా కమర్షియల్ హిట్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. అలాగే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వచ్చింది. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఈ సినిమా పాన్ వరల్డ్ హిట్ కొట్టింది. ఎన్టీఆర్-రామ్ చరణ్ కూడా పాన్ వరల్డ్ స్టార్లుగా రికార్డుకెక్కారు. వరల్డ్ వైడ్ భారీ కలెక్షన్లు రాబట్టింది.

 

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి కాంబినేషన్‌లో వచ్చిన ‘భీమ్లా నాయక్’ మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్‌గా నటిస్తే.. రానా విలన్ పాత్ర పోషించాడు. ఈ సినిమాను చూసేందుకు కూడా ప్రేక్షకులు బాగానే ఆసక్తి చూపించారు. అలాగే డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్-3 కూడా ప్రేక్షకులను వినోదాన్ని పంచింది. ఈ సినిమాలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు. ఈ సినిమా కూడా కమర్షియల్ హిట్ అందుకుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి-రామ్ చరణ్ కాంబినేషన్‌లో ‘ఆచార్య’ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. రీసెంట్‌గా విడుదలైన ‘గాడ్ ఫాదర్’ సినిమా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి-సల్మాన్‌ఖాన్ నటించారు.

 

తాజాగా మరో మల్టీస్టారర్ సినిమాకు రంగం సిద్ధం అవుతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం తెలుగు హీరోలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్-తారక్ కాంబినేషన్‌లో భారీ మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకు రూ.1000 కోట్లు కేటాయించనున్నట్లు సమాచారం. త్వరలో ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కానున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnamraju: రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా.. ఏ దిక్కు లేకపోతే అ పార్టీనే దిక్కవుతుందా?

Raghurama Krishnamraju: ఏపీలో రఘురామకృష్ణం రాజు ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నారు. నిజానికి గత నాలుగేళ్లు ఏపీ రాజకీయాల్లో ఆయన ట్రెండ్ అవుతూనే ఉన్నారు. వైసీపీ ఎంపీల పేర్లు గుర్తు...
- Advertisement -
- Advertisement -