Pushpa: బన్నీ జీవితమంతా పుష్ప మూవీకే పరిమితమా.. ఏమైందంటే?

Pushpa: సాధారణమైన ఎక్స్పర్టేషన్స్ తో విడుదలైన పుష్ప సినిమా నేషనల్ వైడ్ గా ఎంత పెద్ద హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. ముందుగా ఈ సినిమాని టాలీవుడ్ లోనే రిలీజ్ చేయాలనుకున్నాడు సుకుమార్. కానీ రాజమౌళి సలహా మీదట పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశాడు. ఆ సినిమా దెబ్బతో ఏకంగా నేషనల్ అవార్డు విన్నర్ అయిపోయాడు మన బన్నీ. ప్రస్తుతం ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ బిజీలో ఉన్నారు బన్నీ, సుకుమార్. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి బయటకు వచ్చింది.

 

పుష్ప 2 ఇండియాలో షూటింగ్ జరుపుకొని అనంతరం జపాన్ కి వెళ్తున్నారని అక్కడ కీలక సన్నివేశాలు చేస్తున్నారని తెలిసింది. అయితే ఆ షూటింగే క్లైమాక్స్ సీన్స్ అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పుష్ప 2 కి ఎండింగ్, పుష్ప 3 కి స్టార్టింగ్ అక్కడ నుంచే ఉండబోతుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇదేంటి పుష్ప 3 అనుకుంటున్నారా నిజమేనండి పుష్ప 3 ఉండబోతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే పుష్ప 3 ఉంటుంది అని మేకర్స్ ఇప్పటివరకు అఫీషియల్ గా అయితే ఎలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే పుష్ప 3 సినిమా ఉండేటట్లయితే ఇంకా బన్నీ కెరియర్ మొత్తం పుష్ప తోనే అయిపోతుంది అంటూ సెటైర్లు వేస్తున్నారు సినీ జనాలు. పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత మూడేళ్లకి పుష్ప2 ని రిలీజ్ చేస్తున్నారు.

 

ఇక పుష్ప 3 అంటే మరొక మూడేళ్లు పడుతుంది. పైగా ఒకే సినిమాని ఇన్ని సిరీస్ గా తీస్తే ప్రేక్షకులు కూడా బోర్ ఫీల్ అవుతారని అభిప్రాయం వెలువబడుతుంది. అయితే ఈ సినిమాకి పార్ట్-3 ఉంటుంది లేనిది అనేది పార్ట్-2 యొక్క సినిమా రిజల్ట్స్ పై ఆధారపడి ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మూవీ మేకర్స్ అధికారికంగా ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -