C Voter Survey: ఏపీలో ఎన్నికల సర్వేలు కలకం రేపుతోన్నాయి. గత మూడు, నాలుగు నెలల క్రితం పలు జాతీయ మీడియా సర్వేలు వెలువడగా.. ఇందులో ఏపీలో వైసీపీదే అధికారమని అంచనా వేశాయి. వైసీపీలోకి వందకుపైగా ఓట్లు వస్తాయని జాతీయ మీడియా నిర్వహించిన సర్వేల్లో తేలింది. కానీ జాతీయ మీడియా సర్వేలకు రాష్ట్రాల పల్స్ కరెక్ట్ గా తెలియదని, రాష్ట్రాల్లో ప్రజల సెంటిమెంట్ తెలియదనే విమర్శలు ఉన్నాయి. గతంలో అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ మీడియా సర్వేల అంచనాలు ఫెయిల్ అయ్యాయి. చాలా ఎన్నికల్లోనూ జాతీయ మీడియా ఛానెల్స్, జాతీయ సర్వే సంస్థల ఫలితాలు బొక్కబోర్లా పడ్డాయి. దీంతో జాతీయ మీడియా సంస్థల సర్వలపై ప్రజల్లో అపనమ్మకం ఉంది.
ఈ క్రమంలో తాజాగా సీ ఓటర్ సంస్థ యాంగర్ ఇండెక్స్ పేరుతో నిర్వహించిన సర్వేలో ఊహించని ఫలితాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ వ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాల తీరు, సీఎంలపై ఉన్న ఓపీనియన్, సిట్టింగ్ ఎమ్మెల్యేల తీరుపై సర్వే నిర్వహించింది. ఈ సర్వేను తాజాగా బయటపెట్టగా.. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ చివరి వరుసలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో భారీగా వ్యతిరేకత ఉందని, దేశంలోనే ప్రభుత్వాల ఉన్న వ్యతిరేకతో కేసీఆర్ సర్కార్ తొలి స్థానంలో ఉందని తెలిపారు. 66 శాతానికిపైగా కేసీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. ఇక ఏపీ ప్రభుత్వంపై 56.9 శాతం మంది ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సీఓటర్ సంస్థ తన సర్వేలో స్పష్టం చేసింది.
ఇక ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉన్న టాప్ 5 ప్రభుత్వాల్లో తెలంగాణ తొలి స్థానంలో ఉండగా.. ఏపీ నాలుగవ స్థానంలో ఉన్నట్లు సీ ఓటర స్పష్టం చేసింది. ఇక సీఎం పరంగా ఎక్కువ వ్యతిరేకత ఎదుర్కొంటున్న విషయంపై కూడా సీ ఓటర్ సర్వే నిర్వహించింది. ఇందులో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తొలి స్థానంలో, కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై రెండో స్థానంలో ఉండగా.. బీహార్ సీఎం నితీష్ కుమార్ మూడో స్థానంలో ఉన్నారు. ఇక అతి తక్కువ ప్రజా వ్యతిరేకత కలిగిన సీఎంలలో ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఫెల్ ఉన్నారు.
ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత విషయానికొస్తే.. ఏపీలో 28..5 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నట్లు తేలింది. ఇక తెలంగాణలో 23.5 శాతం మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని తేలింది. అయితే దేశవ్యాప్తంగా కేవలం 25 వేల మంది శాంపిల్స్ ను మాత్రమే సేకరించి ఈ సర్వే అంచనాలను వెల్లడించింది సీ ఓటర్ సంస్థ. దీంతో ఈ సర్వపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంత తక్కువ శాంపిల్స్ తో సరైన ఫలితాలు రావని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శాంపిల్స్ ఎక్కువ సేకరిస్తేనే ప్రజల మూడ్ ఎలా ఉందనేది తెలుస్తుందని చెబుతున్నారు. దీంతో ఈ సర్వేపై రాజకీయ పార్టీలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే జగన్ ప్రభుత్వంపై భారీగా ప్రజాగ్రహం ఉందనే ఫలితాలతో వైసీపీలో గుబులు రేగుతోంది. భారీగా ప్రజాగ్రహం ఉందని సీఓటర్ సర్వరే వైసీపీ వర్గాలకు టెన్షన్ పుట్టిస్తోంది.