Diabetes: షుగర్ ఉన్నవారు ఆపిల్ తినవచ్చా.. తినకూడదా?

Diabetes: ప్రస్తుత సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డయాబెటిస్ సమస్య కూడా ఒకటి. ఆహరపు అలవాట్ల కారణంగా చిన్న పెద్ద తేడా లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే డయాబెటిస్ సమస్య ఉన్నవారు ఏది తినాలి అన్నా కూడా ఆలోచిస్తూ ఉంటారు. డయాబెటిస్ ఉన్న వారిని రక్తంలో చక్కెర స్థాయిని ఉంచుకోవడం కోసం ఎన్నో రకాల మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే కొంచెం తీపి పదార్థాలను తినాలన్నా కూడా సంకోచిస్తూ ఉంటారు.

అటువంటి వాటిలో యాపిల్ కూడా ఒకటి. చాలామంది యాపిల్ మేడం వాళ్ళ షుగర్ వస్తుందేమో అని భ్రమ పడుతూ ఉంటారు. మరి డయాబెటిస్ పేషెంట్లు యాపిల్ తినవచ్చా? లేదా? నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డయాబెటిస్ పేషెంట్లు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా వహించాలి. అన్నం అంటే చపాతీలు ఎక్కువగా తీసుకోవాలి. యాపిల్ పండ్లు తినడం వలన షుగర్ పెరుగుతుందని కొందరు అనుకుంటారు. కానీ యాపిల్, బొప్పాయి వంటివి షుగర్ బాధితులకు చాలా మేలు చేస్తాయి.

 

ఇందులోని విటమిన్ సి, ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి రక్షణ కల్పిస్తాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు యాపిల్ ను ఎటువంటి భయం లేకుండా తినవచ్చు. యాపిల్స్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటిలోని అధిక ఫైబర్ కంటెంట్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. చక్కెరను స్థిరీకరిస్తుంది. యాపిల్ లోని ఫ్రక్టోజ్ ఫైబర్ కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేయదు. యాపిల్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, తద్వారా యాపిల్స్ మధుమేహానికి మంచివని రుజువు చేస్తుంది. చర్మంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ప్యాంక్రియాస్‌ను ఇన్సులిన్‌ను విడుదల చేసేలా ప్రోత్సహిస్తాయి. ఇది కణాలలో చక్కెరను సరిగ్గా గ్రహించడంలో సహాయపడుతుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -