Okra: బెండకాయతో షుగర్ కు చెక్ పెట్టవచ్చా?

Okra: మన వంటింట్లో దొరికే కూరగాయలలో బెండకాయ కూడా ఒకటి. బెండకాయను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటారు. బెండకాయను ఓక్రా లేదంటే లేడీస్ ఫింగర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే కొందరు బెండకాయ తినడానికి ఇష్టపడితే మరి కొందరు మాత్రం బెండకాయ తినడానికి ఇష్టపడరు. కానీ బెండకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు ఉండలేరు. మరి బెండకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అలాగే బెండకాయ డయాబెటిస్ తగ్గిస్తుందా? లేదా ఈ విషయాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బెండకాయలో ఫోలేట్, నియాసిన్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, కాల్షియం, రాగి, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ జింక్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. బెండకాయలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే పెక్టిన్ అనే భాగం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవలసిన ఆహార పదార్థాలలో బెండకాయ కూడా ఒకటి. బెండకాయతో పాటు దానిలో ఉన్న గింజలు కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఉపయోగపడతాయి.

 

బెండకాయంలో కరిగే, కరగని ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర లను నియంత్రించ డానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. బెండకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. బెండకాయ అలాగే కొలెస్ట్రాల్, గుండె జబ్బులను కూడా లేకుండా చేస్తుంది. బెండకాయలను రెండు మూడు తీసుకుని నైట్ ఒక గ్లాస్ నీటిలో చీలికలుగా చేసిన బెండకాయలను వేసేయాలి. ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఇలా రోజు చేస్తుంటే మధుమేహం పూర్తిగా తరిమి కొట్టవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -