Rice Roti: అన్నం రోటితో బరువు తగ్గవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Rice Roti: ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు. చాలామంది ఈ అధిక బరువు సమస్యకు కారణంగా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను తగ్గించుకోవడం కోసం రకరకాల వ్యాయామాలు ఎక్సర్ సైజ్ లు, డైటింగ్ లు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ తగిన ఫలితం లభించక చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే బరువు పెరగడం ఈజీ. కానీ బరువు తగ్గించుకోవడం అనేది మాత్రం అంత సులభం కాదు. దీనికోసం హెవీ వర్కవుట్స్, డైట్ ఫాలో కావల్సి ఉంటుంది.

కడుపు, పొట్ట చుట్టూ కొవ్వు కరిగించేందుకు చాలామంది అన్నం, రోటీ మానేస్తుంటారు. మరి ఇలా అన్నం లేదా రోటీ మానేయడం వల్ల ప్రయోజనం ఉందా లేదా? ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బరువు తగ్గడం కోసం ఎప్పుడైతే అన్నం, రోటీ మానేస్తామో సహజంగానే ఫ్రూట్స్, సలాడ్ వంటి వాటిపై ఆధారపడాల్సి వస్తుంది. రోటీలో దాదాపు 140 కేలరీలు ఉంటాయి. అదే సగం గిన్నె అన్నంలో 140 కేలరీలు ఉంటాయి. అంటే అన్నం లేదా రోటీ తినడం వల్ల మీ కేలరీలపై పెద్దగా ప్రభావం పడదు. అన్నం ఎంత తింటున్నామనేదానిపైనే కేలరీలు ఆధారపడి ఉంటాయి.

 

బరువు పెరుగుతుండటం వల్ల ఆరోగ్యానికి చాలా రకాలుగా నష్టం వాటిల్లుతుంది. బరువు పెరిగేకొద్దీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఆ తరువాత డయాబెటిస్ సమస్య తలెత్తుతుంది. దాంతోపాటు నాళికల్లో ప్లక్ పేరుకుపోవడం వల్ల బ్లాకేజ్ ఏర్పడుతుంది. అదే జరిగితే అధిక రక్తపోటు సమస్య ఉత్పన్నమై హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్, ట్రిపుల్ వెసల్ డిసీజ్ వంటి ప్రాణాంతక వ్యాధులు చుట్టుముడతాయి. అందుకే ఆహారపు అలవాట్లపై నియంత్రణ చాలా అవసరం. బరువు తగ్గించుకోవాలంటే గోధుమల రోటీ కంటే మల్టీగ్రెయిన్ పిండి వాడటం మంచిది. ఇందులో మొక్కజొన్నలు, బాజ్రా, జొన్న, రాగి, శెనగలు, ఓట్స్ ఉంటాయి. ఇందులో చాలా తక్కువ మోతాదులో కేలరీలు ఉంటాయి. బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. వైట్ రైస్ లేదా రిఫైన్ రైస్ బరువు పెరిగేందుకు దోహదపడుతుంది. దీని స్థానంలో బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్, వైల్డ్ రైస్ వాడటం మంచిది.

 

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -