Tollywood: ఈ టాలీవుడ్ స్టార్స్ కు తెలుగు చదవడం కూడా రాదా?

Tollywood: ఒకప్పుడు టాలీవుడ్‌తో తెలుగు సాహిత్యం, నాటకాలకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. పౌరాణిక నాటకాలు కూడా వేసే వారు. తెలుగు సాహిత్యంపై మంచి పట్టు ఉండేది. అయితే తెలుగులో డైలాగ్స్ ఎవరైనా చెప్తారు. ఒకప్పటి హీరోలకు తెలుగులో డైలాగులు చెప్పడంతోపాటు రాయడం కూడా తెలుసు. ఎన్టీఆర్, ఏఎన్సార్ వంటి స్టార్ హీరోలు తెలుగులో రాయడం, లేదా చదవడంలో ప్రతిభను కనబర్చేవారు. తెలుగులో డైలాగ్స్ చెబుతూ పలువురి ప్రశంసలు అందుకునే వారు.

 

ఆగకుండా డైలాగులు చెప్తూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేవారు. టాలీవుడ్‌లో ఏఎన్‌ఆర్, ఎన్టీఆర్, కృష్టంరాజు తెలుగులో రాయడం, చదవడం వచ్చు. వీరి తర్వాత తరం హీరోలు చిరంజీవి, బాలయ్య, మోహన్ బాబు కూడా తెలుగులో రాసేవారు.. చదివేవారు. కానీ ఇప్పటితరం స్టార్ హీరోలలో చాలా మందికి తెలుగు చదవడం రాయడం రాదు. అయితే తెలుగులో ఏఏ హీరోలకు తెలుగు రాయడం, చదవడం రాదో ఒక్కసారి చూద్దాం.

 

 

సూపర్ స్టార్ మహేశ్ బాబు తెలుగులో డైలాగులు ఇరగదీస్తారు. మహేశ్ బాబు డైలాగ్స్ చెబుతున్నారంటే.. ఫ్యాన్స్ గోల గోల చేస్తుంటారు. అయితే తెలుగు నేలపై పుట్టిన మహేశ్ బాబుకు తెలుగు రాయడం కానీ చదవడం కానీ రాదంటే ఆశ్చర్యపోవాల్సిందే. షూటింగ్‌లో డైలాగులను ఇంగ్లీష్‌లో రాసుకుని ప్రిపేర్ అవుతుంటారట. అలాగే హీరోయిన్ జయసుధకు కూడా తెలుగు రాదంటే ఎవ్వరూ నమ్మరు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించినా.. ఆమె తెలుగు మాత్రం నేర్చుకోలేదట. తెలుగులో ఉన్న డైలాగులను అసిస్టెంట్ డైరెక్టర్ చెప్పింది విని.. సేమ్ టు సేమ్ చెప్పేదట.

 

 

అలాగే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మికి కూడా తెలుగు రాదు. ఆమె తెలుగులో మాట్లాడితే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. చాలా మంది ఆమె తెలుగులో మాట్లాడితే ట్రోల్స్ చేస్తుంటారు. ఈమెతో పాటు మంచు మనోజ్, మంచు విష్ణుకు కూడా తెలుగు రాయడం రాదట. అలాగే అక్కినేని నాగార్జునకు కూడా తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. నాగార్జున కూడా ఇంగ్లీష్‌లో డైలాగులు రాసుకుని చెప్తూ వస్తున్నారు. వీరితోపాటు వరుణ్ సందేష్, నాగచైతన్య, అఖిత్, తరుణ్, వరుణ్ తేజ్, నిహారిక తదితరులకు తెలుగులో రాయడం, చదవడం రాదట.

 

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -