Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు మూవీని ఇప్పట్లో చూడలేమా?

Hari Hara Veera Mallu: తెలుగులో హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా తిరుగులేని స్టార్ డంని సొంతం చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నాడంటే అది ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మెగా హీరోగా వారసత్వంతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. మెగా వారసత్వపు నీడ నుండి బయటకు వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపును, ఫ్యాన్ బేస్ ను పవర్ స్టార్ సొంతం చేసుకున్నాడు. తెలుగులో ఇప్పుడు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ను పవన్ కళ్యాణ్ సొంతం చేసుకున్నాడు.

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతోందంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు భయపడతాయి. పవన్ చేసే సినిమాల లెవల్ అంతకంతకు పెరుగుతుండగా.. పవన్ హీరోగా వస్తున్న ప్యాన్ ఇండియా సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా మీద భారీ అంచనాలు ఉండగా.. తాజా అప్ డేట్లు పవన్ ఫ్యాన్స్ ను నిరాశపరుస్తున్నాయి.

 

పవన్ తన కెరీర్ లో మొదటిసారి చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ‘హరిహర వీరమల్లు’ సినిమా రాబోతుండగా.. ఈ సినిమాకు ఏ.ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా పవన్ ‘ఖుషి’ రీరిలీజ్ ఈవెంట్ లో మీడియాతో మాట్లాడిన ఏ.ఎం. రత్నం ఇచ్చిన అప్ డేట్ పవన్ అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. అనుకున్న సమాయానికి ఈ సినిమా రాకపోవచ్చే హింట్ ఆయన ఇచ్చాడు.

 

క్రిష్, పవన్ కాంబోలో వస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా ఈ ఏడాది వేసవికి విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మరియు విజువల్ ఎఫెక్టుల కారణంగా ఈ సినిమా రిలీజ్ మరింత ఆలస్యం అయ్యేలా ఉందని నిర్మాత ఏ.ఎం రత్నం వెల్లడించాడు. దీంతో ఈ సినిమా ఈ ఏడాది వేసవికి కాకుండా.. దసరా బరిలో నిలుస్తుందనే చర్చ నడుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -