Amarinder Singh: ఫెయిల్యూర్ నేతనే నమ్ముకున్న బీజేపీ.. చివరికి పెప్టెనే దిక్కయ్యారా?

Amarinder Singh: ఏ పార్టీ అయినా బాగా పాపులర్ అయిన నేతలను, బాగా క్రేజ్ ఉన్న నేతలను పార్టీలో చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతుంది. క్రేజ్ ఉన్న నేతలు పార్టీలో చేరడం ద్వారా తమ పార్టీ బలపడుతుందని పార్టీలన్నీ భావిస్తాయి. అందుకే పాపులర్, ప్రజల్లో క్రేజ్, మంచి పేరు ఉన్న నేతలను తమ పార్టీలలో చేర్చుకునేందుకు ప్రతిఒక్క పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. తమ పార్టీలో చేరాల్సిందిగా అలాంటివారిపై పార్టీలన్నీ ఒత్తిడి తెస్తూ ఉంటాయి. వారికి ఫలానా పదవి ఇస్తామంటూ పార్టీలన్నీ ఆపర్లు ప్రకటిస్తూ ఉంటాయి. కానీ ప్రజల్లో క్రేజ్, పలుకుబడి లేని నేతలను ఏ పార్టీ పట్టించుకోదు.

ఎన్నికల్లో గెలుపొందలేని నేతలను ఏ పార్టీ చేర్చుకోదు. ఒకవేళ అలాంటి నేతలు చేరినా ఎలాంటి పదవులు ఇవ్వరు. పార్టీ కోసం పనిచేయమని చెబుతారు. కానీ బీజేపీ ఏకంగా ఎన్నికల్లో ఫెయిల్యూర్ అయిన ఓ ముఖ్యనేతను చేర్చుకోవడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇంతకు ఆ నేత ఎవరో కాదు.. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్.. ఆయన తాజాగా కాషాయ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ నేతలకు ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కానీ ఆయన కమలం గూటికి చేరడంతో పంజాబ్ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

గత పంజాబ్ ఎన్నికలకు ముందు పంజాబ్ సీఎంగా అమరీంద్ సింగ్ ఉన్నారు. కానీ ఎన్నికలకు కొద్దినెల ముందు సీఎం పదవి నుంచి ఆయనను కాంగ్రెస్ అధినాయకత్వం తొలగించింది. ఆయన స్థానంలో వేరేవారికి స్ధానం కల్పించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి అమరీంద్ సింగ్ రాజీనామా చేసి బయటకు వచ్చారు. గత ఎన్నికలకు కొద్దినెలల ముందు లోుక్ కాంగ్రెస్ పార్టీలోని స్థాపించారు. గత పంజాబ్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఏకంగా మాజీ సీఎం అమరీంద్ సింగ్ నే ఓడిపోయారు. ఆప్ దెబ్బకు అమరీందర్ సింగ్ కు డిపాజిట్లు కూడా దక్కలేదు.

అలాంటి ఫెయిల్యూర్ నేతను బీజేపీ ఎందుకు చేర్చుకుందో చాలామందికి అర్ధం కావడం లేదు. ఆయనను చేర్చుకోవడం వల్ల బీజేపీకి కలిగే లాభం ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అమరీందర్ సింగ్ లోక్ కాంగ్రెస్ పార్టీని బీజేపీలో వీలీనం చేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో రానున్న లోక్ సభ ఎన్నికల్లో అయినా మెజార్టీ పార్లమెంట్ సీట్లను పంజాబ్ లో గెలుచుకుని ఆప్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మాజీ సీఎం అమరీందర్ సింగ్ ను తమ పార్టీలో బీజేపీ చేర్చుకకుంది.

కానీ అమరిందర్ సింగ్ వయస్సు 80 సంవత్సరాలు. ఈ వయస్సులో ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటమే గొప్ప. ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఫెయల్ అయిన అమరీంద్ సింగ్ ను చేర్చుకుని లోక్ సభ ఎన్నికలకు బీజేపీ సిద్దపడటం కత్తి మీద సాము తరహాలో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు గట్టిగా పోరాటం చేశారు. కేుంద్ర ప్రభుత్వంపై పంజాబ్ రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ పోరాటంలో వందలమంది రైతులు చనిపోయారు. చివరికి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకకుంటున్నట్లు మోదీ ప్రకటించారు.

దీంతో రైతులు మరణించిన తర్వాత వ్యవసాయ చట్టాలను వెన్కకి తీసుకున్న పరిణామంపై బీజేపీపై పంజాబ్ రైతుల్లో తీవ్ర ఆగ్రహం ఉంది. దీంతో గత ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ ను ఘోరంగా ఓడించిన ప్రజలు.. ఇప్పుడు అదే కెప్టెన్ ను చూసి బీజేపీకి ఓట్లేస్తరా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -