Divi: వైరల్ అవుతున్న దివి దిగజారుడు వ్యాఖ్యలు.. తప్పే కదా?

Divi: చాలా మందికి మంచి కెరీర్ అవకాశలు అందించింది బిగ్ బాస్. బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిపోయి మంచి హిట్స్ సాధించిన వారు ఉన్నారు. అలా అవకాశాలు అందిపుచ్చుకున్న వారిలో “దివి” ఒకరు. కాస్త పొడుగ్గా, నాజూగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ అందంతో పటు అభినయంతోను ఆకట్టుకుంది. ఇక బిగ్ బాస్ లో అయితే ఎలాంటి గొడవలు, కాంట్రవర్సీలు లేకుండా మంచి పేరు సంపాదించింది. ఫైనల్స్ లో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి కూడా దివి అందాన్ని పొగిడారు.

 

మాటిచ్చిన చిరు..
దివి అందానికి అభినయానికి ఫ్లాట్ అయిన చిరంజీవి.. దివికి తన సినిమాలో అవకాశం ఇస్తానని మాటిచ్చారు. ఇక ఆ మాటను నిలబెట్టుకోవడానికి చిరంజీవి.. తన గాడ్ ఫాదర్ మూవీలో అవకాశం ఇచ్చారు. దానితో దివి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. మెగాస్టార్ సినిమాలో మంచి రోల్ ని కొట్టేసింది దివి. ప్రస్తుతం టీవీ షోలు, వెబ్ సిరీస్ లతో పాటు పలు సినిమాల్లోనూ నటిస్తుంది దివి.

 

క్యాస్టింగ్ కౌచ్ పై..
సోషల్ మీడియాలో ఎప్పుడు ఆక్టివ్ గా ఉంటుంది దివి. తన హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో అభిమానులకు విందు అందిస్తుంది. దివి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల దివి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి క్యాస్టింగ్ కౌచ్ పై ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. మన ప్రవర్తనను బట్టే ఇతరులు మనల్ని అంచనా వేస్తారని తెలిపింది.

ఇక అబ్బాయి అమ్మాయి ఇష్టపడి కమిట్ అవ్వడంతో తప్పేమి లేదని.. వాళ్లకు ఇష్టం ఉన్నప్పుడు అది తప్పు కాదని దివి అభిప్రాయపడింది. ఇండస్ట్రీలో చాలా మంది ఇలా ఇష్టపడి కమిట్ అవుతున్నారని తెలియజేసింది. ఇక నువ్వెప్పుడైనా క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదుర్కున్నావా? అని యాంకర్ అడిగిన ప్రశ్నకు లేదని సమాధానం ఇచ్చింది దివి. కాగా.. దివి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts